వంటలక్క ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. త్వరలో..?

మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా వంటలక్క పాత్రకి హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ ఉంది. వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ ఒక్క సీరియల్ తోనే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి టీవీల ముందు కూర్చుంటారు ప్రేక్షకులు. బుల్లితెర ప్రేక్షకులను అంతలా ఆకర్షించింది ఈ సీరియల్. అయితే త్వరలో వంటలక్క అభిమానులందరికీ బ్యాడ్ న్యూస్ అంద పోతుందా అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

 

 

 

ప్రస్తుతం టాప్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్న ఈ సీరియల్ను మంచి టీఆర్పీ రేటింగ్ ఉండగానే ముగించాలని సీరియల్ నిర్మాతలు భావిస్తున్నారట. ఇంకొంచెం సాగదీస్తే ప్రేక్షకులు కూడా బోర్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉందని అందుకే త్వరగా ఈ సీరియల్ ముగించాలని భావిస్తున్నారట. అదే సమయంలో ప్రేమి విశ్వనాథ్ కు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అవకాశం వచ్చిన నేపథ్యంలో సీరియల్ షూటింగ్ కాస్త కష్టమయ్యే అవకాశం ఉందని భావిస్తున్న నిర్మాతలు తొందరగా ముగించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే నిజంగా వంటలక్క అభిమానులందరికీ గుండెలు పగిలే వార్త అని చెప్పాలి.