రాధే శ్యామ్‌లో ప్ర‌భాస్ త‌మ్ముడిగా ఆ క్రేజీ హీరో…!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధే శ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రం తెలుగుతో పాటుగా మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది.

 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు తమ్ముడి రోల్ ఒకటి ఉందట. గతంలో ఇదే రోల్ లో తమిళ్ యంగ్ హీరో అథర్వా కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఆ రోల్‌లో క్రేజీ హీరో జీవి ప్రకాష్ న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

 

 

జీవి ప్ర‌కాష్ న‌టుడే కాదు త‌మిళంలో సంగీత దర్శకుడు, గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎ. ఆర్. రెహ్మాన్ జీవి ప్ర‌కాష్‌కు స్వ‌యాన‌ మేన‌మామ‌. ప్ర‌స్తుతం ఇత‌డినే రాధే శ్యామ్‌లో ప్ర‌భాస్ త‌మ్ముడిగా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా ప్రేరణగా క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.