ఆ హీరోతో ల‌వ్ ఎఫైర్ వ‌ల్లే ఆ హీరోయిన్ కెరీర్ నాశ‌న‌మైందా…!

నిఖితా తుక్రాల్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `హాయ్` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన నిఖితా.. ఆ త‌ర్వాత సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, క‌ళ్యాణ రాముడు, నీ నవ్వేచాలు ఇలా వ‌రుస‌ సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగులోనే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళ్ సినిమాల్లోనూ న‌టించి స‌త్తా చాటింది.

 

ముఖ్యంగా క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి మంచి అవ‌కాశాల‌తో ఒక‌ప్పుడు దూసుకుపోయింది. అయితే నిఖిత ఎక్కువ కాలంలో సినీ ఇండ‌స్ట్రీలో కొన‌సాగ‌లేక‌పోయింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ఓ ప్ర‌ముఖ కన్నడ హీరోతో సంబంధం పెట్టుకుంది. కానీ, అప్ప‌టికే స‌ద‌రు హీరోకు పెళ్లై కొడుకు కూడా ఉన్నాడు. దీంతో వివాదం చెల‌రేగింది. స‌ద‌రు హీరో భార్య త‌న కాపురంలో నిప్పులు పోసిందంటూ నిఖిత‌పై ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలోనే పోలీసులు స‌ద‌రు హీరోను అరెస్ట్ కూడా చేశారు.

 

అయితే చివ‌ర‌కు నిఖతను మూడేళ్లపాటు ఎవరూ సినిమాల్లో తీసుకోరాదంటూ కన్నడ ఇండస్ట్రీ బహిష్కరించింది. దీంతో ఆవేద‌న‌కు గురైన నిఖితా సినిమాపై దృష్టి సారించ‌లేక‌పోయింది. ఇక ఆ త‌ర్వాత అవకాశాలు కూడా లేకపోవడంతో బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త గన్దీప్ సింగ్ మాగోని ప్రేమించి 2016లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది.