వాళ్ల వ‌ల‌లో చిరంజీవి చిక్కుకుపోయారా.. డేంజ‌ర్లోనే…!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా విష‌యం పెక్క‌న పెడితే.. చిరు ఓకే చేసిన త‌దుప‌రి ప్రాజెక్ట్స్ పై మాత్రం మెగా అభిమానులు కాస్త అస‌హ‌నంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

 

ఎందుకంటే, చిరు త‌ర్వాతి సినిమాలు డైరెక్ట్ చేస్తున్న దర్శకులు ముగ్గురూ ఫ్లాప్ డైరెక్టర్సే. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ – శృతి హాసన్ జంటగా న‌టించిన `వేదలమ్‌` తెలుగులో చిరు హీరోగా రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డేరెక్ట్ చేయ‌నున్నారు. అలాగే చిరు మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్‌లాల్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో కూడా న‌టించ‌‌నున్నారు.

 

 

ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇక ఈ రెండు చిత్రాల‌తో పాటుగా ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పారు. ఈ లెక్క‌న ఆచార్య త‌ర్వాత చిరును డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కులు ముగ్గురూ ప్లాపులో ఉన్న వారే కావడం గమనార్హం. మ‌రి ఫ్లాప్ డైరెక్ట‌ర్స్ వ‌ల‌లో చిక్కుకుపోయిన చిరు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.