స్టార్ హీరోలకి భార్యలు ఎక్కడ తక్కువ కాదు.. ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

ఒకప్పుడైతే అసలు హీరోల భార్యలు అంటే ఎలా ఉండేవారు ఎవరికీ తెలిసేది కాదు. కనీసం హీరోల భార్యలు ఏ ఈవెంట్ కి కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈమధ్య కాలంలో టెక్నాలజీ పెరగడమే కాదు హీరోల కుటుంబీకులు ఎవరు అనేది కూడా ప్రేక్షకులు అందరికి తెలిసిపోతుంది. ముఖ్యంగా హీరోల భార్యలు ప్రస్తుతం హీరోల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోల భార్యలు ప్రస్తుతం ఇంటి బాధ్యతలు చూసు కుంటూనే మరోవైపు వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు.

 

 

నాచురల్ స్టార్ నాని భార్య అంజనా ప్రస్తుతం ఆర్కా మీడియా లో క్రియేటివ్ హెడ్గా పని చేస్తుంది. ఇక నాని భార్య సంపాదన భారీగానే ఉంటుంది. ఇక రాజీవ్ కనకాల భార్య సుమ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజీవ్ కనకాల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తూ ఉంటుంది సుమా. అల్లరి నరేష్ భార్య విరూప కూడా కార్పొరేట్ ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ వ్యాపారవేత్తగా దూసుకుపోతుంది. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఇంటి బాధ్యతలు చూసు కుంటూనే మరోవైపు తన తండ్రి ఇనిస్టిట్యూట్ కూడా నిర్వహణలో కూడా పాలు పంచుకుంటుంది.