ఉదయ్ కిరణ్ చనిపోయాక.. అతని భార్య ఏం చేస్తుందో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉవ్వెత్తున ఎగసిన కెరటం లాగా యూత్ ఫుల్ హీరోగా తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న ఉదయ్ కిరణ్… స్టార్ హీరో గా మారుతాడు అనుకుంటున్న తరుణంలో వరుసగా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో తీవ్రంగా డిప్రెషన్కు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓ రోజు తీవ్ర మనస్థాపానికి గురై తన ఫ్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అభిమానులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

 

ఉదయ్ కిరణ్ మరణాన్ని ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. కాగా ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుంది అనే దానిపై ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఉదయ్ కిరణ్ మరణం తర్వాత తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ లక్షల జీతం తీసుకుంటున్నారు ఉదయ్ కిరణ్ భార్య విషిత. అంతేకాదు ఎన్నో అనాధాశ్రమాలకు సేవ చేసేందుకు కూడా ముందుకు కదిలారు. వీకెండ్ సమయాల్లో ఎన్జీవో సంస్థలతో కలిసి అనాధాశ్రమాల కి వెళ్లి తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటారట విషిత.