పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన శ్రీముఖి.. ఆ అబ్బాయితోనే…!

ప్ర‌స్తుతం బుల్లితెర స్టార్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న శ్రీ‌ముఖి గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మ‌డు.. వెండితెర‌పై న‌టిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా‌ల శ్రీ‌ముఖిపై ప‌లు క్రేజీ రూమ‌ర్లు గుప్పుమ‌న్నాయి.

 

శ్రీ‌ముఖి ఎవ‌రితోనూ డేటింగ్ చేస్తుంద‌ని.. అత‌డినే త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతుంద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందించిన శ్రీ‌ముఖి ఓ క్లారిటీ ఇచ్చేసింది. ప్ర‌స్తుతం తాను ఎవ‌రితోనూ డేటింగ్ చేయ‌డం లేద‌ని.. తాను సింగిల్‌గానే ఉన్నాన‌ని శ్రీ‌ముఖి స్ప‌ష్టం చేసింది.

 

ఇంట్లో సంబంధాలు చూస్తున్నార‌ని.. అయితే తాను లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ చేసుకుంటాన‌ని శ్రీ‌ముఖి తెలిపింది. అలాగే ప్ర‌స్తుతానికి అబ్బాయి దొర‌క‌లేదు.. ఒక‌వైళ ఎవ‌రైనా న‌చ్చితే వెంట‌నే మ్యారేజ్ చేసుకోన‌ని.. అత‌డితో క‌నీసం ఓ రెండు, మూడేళ్లు ట్రావెల్ చేసి అంతా సెట్ అయితేనే వివాహం చేసుకుంటాన‌ని చెప్పుకొచ్చింది. మ‌రి శ్రీ‌ముఖి కోరుకునే వ్య‌క్తి ఎప్పుడు దొరుకుతాడో చూడాలి.