ఎన్టీఆర్ బాట‌లోనే రామ్‌చ‌ర‌ణ్‌… రాజ‌మౌళి మ‌ళ్లీ అలా…!

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో.. సామాన్యులే కాదు ఎప్పుడూ షూటింగ్ల‌తో బిజీ బిజీగా ఉండే సెల‌బ్రెటీలు కూడా దాదాపు ఆరేడు నెల‌ల పాటు ఇంటికే ప‌రిమితం అయ్యారు. అయితే ఇటీవ‌ల కేంద్రం లాక్‌డౌన్ ఎత్తేడంతో.. మ‌ళ్లీ అంద‌రూ మెల్ల మెల్ల‌గా షూటింగ్స్‌లో జాయిన్ అవుతున్నారు. అదే స‌మయంలో కొంద‌రు సెల‌బ్రెటీలు ఫ్యామిలీతో వెకేష‌న్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

 

 

ఇప్ప‌టికే కాజ‌ల్‌, ర‌కుల్, స‌మంత‌, రానా, మ‌హేష్ ఇలా చాలా మంది ఫ్యామిలీతో విహార‌యాత్ర కోసం విదేశాలు వెళ్తున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ కూడా `ఆర్ఆర్ఆర్‌` షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లి వ‌చ్చాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. రామ్ చ‌ర‌ణ్ కూడా ఎన్టీఆర్‌ను ఫాలో అవ్వ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, చెర్రీ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

 

లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ రీ స్టాట్ అయ్యి.. శెర‌వేగంగా ముందుకు సాగుతోంది. అయితే ఇలాంటి త‌రుణంలో రామ్ చరణ్‌ కూడా భార్య‌ ఉపాసనతో ఈ నెలాఖరున ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లబోతున్నట్లు స‌మాచారం. దీంతో ఇటీవ‌ల ఎన్టీఆర్‌కు షూటింగ్ నుంచి బ్రేక్ ఇచ్చిన జ‌క్క‌న్న‌.. ఈ సారి చెర్రీకి ఇవ్వాల్సి ఉంద‌ట‌.