వామ్మో… కాజ‌ల్ హ‌నీమూన్‌కు అంత ఖ‌ర్చా….!

ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయిపోయింది. త‌న ప్రియుడు గౌత‌మ్ కిచ్లూను ఆమె గ‌త నెల 30న సింపుల్‌గా పెళ్లాడేసింది. ఈ క్ర‌మంలోనే ఈ కొత్త పెళ్లి కూతురు హ‌నీమూన్ కోసం మాల్దీవుల్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకుంది. ఇప్ప‌టికే కాజ‌ల్ – గౌత‌మ్ జంట మాల్దీవుల్లో బీచ్‌ల్లో పిచ్చగా ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బీచ్‌లో త‌న భ‌ర్త‌తో హాట్‌గా ఉన్న ఫొటోల‌ను కాజ‌ల్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి బాగా వైర‌ల్ అయ్యాయి.

ఈ హ‌నీమూన్ ట్రిప్‌లో కాజ‌ల్ – గౌత‌మ్ జంట ఏకాంతంగా ఓ బెడ్‌పై ఉన్న ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో పిచ్చ‌గా వైర‌ల్ అయ్యాయి. ఏదేమైనా కాజ‌ల్ జంట హ‌నీమూన్ చాలా గ్రాండ్‌గా జ‌రిగింద‌నే అర్థ‌మ‌వుతోంది. ఇందుకోసం వీరు భారీగానే ఖ‌ర్చు చేశార‌ట‌. మాల్దీవుల్లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌ను వారం రోజుల పాటు అద్దెకు తీసుకున్నార‌ట‌. ఇందుకోస‌మే రు. 40 ల‌క్షలు ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది.

వీటితో పాటు ప్ర‌యాణ ఖ‌ర్చులు, ఇత‌ర ఖ‌ర్చులు కూడా క‌లిపితే ఓవ‌రాల్‌గా రు.50 ల‌క్ష‌ల‌కు పైగానే కాజ‌ల్ జంట హ‌నీమూన్ ఖ‌ర్చు అవుతుంద‌ని తెలుస్తోంది. కాజ‌ల్ లాంటి సీనియ‌ర్ హీరోయిన్‌కు రు. 50 ల‌క్ష‌లు పెద్ద లెక్క‌కాద‌నుకోవాల్సిందే.