సినిమా ర‌న్ టైంపై బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌స్తుతం సినిమా ర‌న్ టైం బాగా త‌గ్గిపోతోంది. చాలా మంది ద‌ర్శ‌కులు ర‌న్ టైంను 2 నుంచి 2.15 గంట‌ల లోపు మాత్ర‌మే ఉండాల‌ని చెపుతోన్న సంద‌ర్భాలే ఎక్కువ‌. సినిమా ర‌న్ టైం ఎక్కువుగా ఉన్న‌ప్పుడు ఏ మాత్రం బోర్ కొట్టినా సినిమాను ప్రేక్ష‌కులు నిర్దాక్షిణ్యంగా తిర‌స్క‌రిస్తున్నారు. తాజాగా సినిమాల ర‌న్ టైంపై సీనియ‌ర్ న‌టుడు, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సెహారీ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ సినిమా తీస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా… నిర్మాత ఆర్థిక ప‌రిస్థితి దృష్టిలో ఉంచుకోవాల‌న్నారు.

సినిమా ర‌న్ టైం అనేది రెండు గంట‌లు మించి ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌కు రాజ‌కీయాలు, సామాజిక సేవ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని కూడా బాల‌య్య చెప్పారు. సామాజిక సేవ చేయ‌డం త‌మ ర‌క్తంలోనే ఉంద‌న్న బాల‌కృష్ణ‌.. సినిమా రంగంలోకి కొత్త న‌టులు, కొత్త ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు వ‌చ్చి టాలెంట్ నిరూపించుకోవాల‌ని చెప్పారు. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న బీబీ 3 సినిమాలో న‌టిస్తున్నారు.