స‌మంత యాంక‌రింగ్‌కు అంత రెమ్యున‌రేష‌నా… !

చెన్నై చిన్న‌ది సమంత బిగ్‌బాస్ హోస్ట్‌గా వ‌చ్చి దుమ్ము రేపేసింది. స‌మంత హోస్ట్ చేసిన ఎపిసోడ్‌కు మామ నాగార్జున ఎపిసోడ్ల‌ను మించిన రేటింగ్ రావ‌డంతో అంద‌రూ అవాక్క‌వుతున్నారు. తాజాగా స‌మంత యాంక‌రింగ్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లు వారి ఆహా ఓటీటీకి శామ్ – జామ్ పేరిట ఓ టాక్ షో చేస్తోంది. ఈ షోలో భాగంగా ఆమె తొలి ఎపిసోడ్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చిట్ చాట్ చేసింది. మొత్తం 10 ఎపిసోడ్ల‌ను ఆమె యాంక‌రింగ్ చేయ‌నుంది.

 

ఈ కార్య‌క్ర‌మాన్ని యాంక‌రింగ్ చేస్తోన్నందుకు గాను స‌మంత 10 ఎపిసోడ్ల‌కు రు 1.5 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోనుంద‌ట‌. వాస్త‌వానికి స‌మంత రేంజ్‌కు ఈ మొత్తం త‌క్కువే అంటున్నారు. స‌మంత ఫామ్‌లో ఉన్న‌ప్పుడు ఆమె ఒక్కో సినిమాకే రు 1.75 కోట్ల నుంచి రు. 2 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంది. అలాంటిది ఇప్పుడు ప‌ది ఎపిసోడ్ల‌కు కేవ‌లం రు 1.5 కోట్లు అంటే త‌క్కువే అంటున్నారు.

 

అయితే అల్లు ఫ్యామిలీ ఆహా ఓటీటీ యాప్ కావ‌డంతో అల్లు ఫ్యామిలీ చేసిన లాబీయింగ్‌తోనే ఆమె ఇంత త‌క్కువ మొత్తానికి ఈ ప్రోగ్రామ్ చేస్తుందంటున్నారు. ఏదేమైనా పెళ్ల‌య్యాక కూడా పిచ్చ క్రేజ్‌తో ఉన్న స‌మంత‌కు మంచి సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు టాక్ షోల‌తో అన‌వ‌స‌రంగా ఆమె క్రేజ్ త‌గ్గించుకుంటోందా ? అన్న సందేహాలు కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.