రిలీజ్‌కు ముందే ర‌వితేజ క్రాక్‌కు దెబ్బ‌… !

మాస్‌ హీరో రవితేజ రవితేజ తాజా చిత్రం `క్రాక్‌`. డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌గా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ‌

 

 

సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం `క్రాక్‌`ను సంక్రాంతి బ‌రిలో దింపేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న ర‌వితేజ కూడా ఈ చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. ఇలాంటి త‌రుణంలో.. క్రాక్‌కు ఓ కొత్త చిక్కొచ్చి ప‌డింది. ఈ సినిమాను నిర్మిస్తున్న మ‌ధు గతేడాది విశాల్ హీరోగా టెంపర్ రీమేక్ అయోగ్యను నిర్మించాడు.

 

 

ఈ చిత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ క్ర‌మంలోనే తాజాగా స్క్రీన్ సీన్ మీడియా అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.. డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా క్రాక్ సినిమాను విడుద‌ల‌ చేయడానికి వీల్లేదంటూ కేసు ఫైల్ చేసి మధుపై న్యాయపోరాటానికి దిగింది. దీంతో ర‌వితేజ క్రాక్ విడుద‌ల సందిగ్ధంలో ప‌డింది.