పూరి జ‌గ‌న్నాథ్‌ కొడుకుతో హేమ కూతురు పెళ్లి…!

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి గురించి ప్ర‌త్యేకంగా ప‌ర‌చ‌యాలు అవ‌స‌రం లేదు. మెహ‌బూబా చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్.. రెండో ప్ర‌య‌త్నంగా రొమాంటిక్ సినిమాలో న‌టించారు. అనిల్ ప‌డూరిని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది.

 

 

 

సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. ఆకాశ్ పూరికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. న‌టి హేమ కూతురు ఇషాతో ఆకాశ్ పూరి ప్రేమ‌లో ఉన్నాడ‌ని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నాడ‌ని.. దాంతో త్వ‌ర‌లోనే పూరి జ‌గ‌న్నాథ్ – హేమ బంధువులు కాబోతున్నార‌న్న వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

 

 

 

 

అయితే తాజాగా హేమ వీటిపై స్పందిస్తూ.. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌కు అన్న‌య్య‌తో స‌మాన‌మ‌ని, అందుకే కాస్త చ‌న‌వుగా ఉంటామ‌ని చెప్పింది. అయితే ఆకాశ్‌-ఇషా పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని హేమ తేల్చేసింది. ఇషా పెద్ద‌ల కుదిర్చిన పెళ్లే చేసుకుంటాన‌ని ఇప్ప‌టికే త‌న‌కు మాట ఇచ్చింద‌ని.. ఒక‌వేళ తాను ఎవ‌రినైనా ప్రేమించినా పెళ్లి చేస్తామ‌ని హేమ తెలిపింది.