హీరో ఆర్య‌న్ రాజేష్ పెళ్లి వెన‌క ఇంత క‌థ ఉందా… తండ్రి మాట కోసం…!

ప్రముఖ దర్శకుడు దివంగత ఇవివి సత్యనారాయణ కుమారుడు, సినీ నటుడు ఆర్యన్‌ రాజేష్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో దాదాపు 14 సినిమాల్లో న‌టించిన ఆర్య‌న్ రాజేష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌న‌య్యారు. అయితే తండ్రి ఇవివి మ‌ర‌ణాంత‌రం కుటుంబ బాధ్య‌త‌ల‌ను భుజా‌న వేసుకున్న ఆర్య‌న్ రాజేష్ సినిమాల‌పై దృష్టి సారించ‌లేక‌పోయారు.

 

 

 

ఇక ఈ క్ర‌మంలోనే పెళ్లి చేసుకుని సినిమాల‌కు పూర్తిగా దూరం అయ్యారు. అయితే ఆర్య‌న్ రాజేష్ పెళ్లి ఓ పెద్ద కథే ఉంది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కంటిపూడి అమరనాథ్ ఇవివి సత్యనారాయణకు స్నేహితుడు. అయితే అమరనాథ్ కుమార్తె సుభాషిణిని చూడంగానే.. ఇవివి ఆర్య‌న్‌కు మంచి జోడీ అని ఫిక్స్ అయిపోయి పెళ్లిని ఖాయం చేసేశార‌ట‌.

 

 

అయితే ఎం.బి.ఏ చేసిన సుభాషిణిని మొద‌ట ఫొటోలో చూసి ఆర్య‌న్ పెళ్లికి నో చెప్పాడ‌ట‌. దీంతో ఇవివి నేరుగా చూడ‌మ‌ని స‌ల‌హా ఇవ్వ‌గా.. ఆర్య‌న్ సుభాషిణి ఇంటికి వెళ్లి చూసి న‌చ్చ‌డంతో పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. ఈ క్రమంలోనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇవివి అనారోగ్య కారణంగా ఆర్య‌న్‌ పెళ్లి కాకముందే మరణించారు. ఇక ఆ త‌ర్వాత‌ త‌న తండ్రి మాట ప్ర‌కార‌మే.. సుభాషిణిని ఆర్య‌న్ పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ దంప‌తుల‌కు ఓ పాప‌, బాబు ఉన్నాడు. ఇక ఇటీవ‌లె ఆర్య‌న్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. `విన‌య విధేయ రామ` చిత్రంలో చెర్రీకి అన్న‌గా న‌టించాడు.