ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్ల మ‌ధ్య‌లో ఎన్టీఆర్‌… ఆ ల‌క్కీ లేడీ ఎవ‌రో…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం అయిన వెంట‌నే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త‌న 30వ చిత్రం స్టాట్ చేయ‌నున్నారు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

 

 

ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే చాలా మంది పేర్లు వినిపించ‌గా.. ప్ర‌స్తుతం మాత్రం రష్మిక మందన్న, కియారా అద్వానీ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఖ‌చ్చితంగా వీరిద్ద‌రిలోనే ఎవ‌రో ఒక‌రిని ఫిక్స్ చేస్తార‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.

 

 

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. త్రివిక్ర‌మ్ త్వ‌ర‌లోనే కియారా అద్వానీని సంప్ర‌దించ‌నున్నార‌ట‌. ఒక‌వేళ ఆమె డేట్స్ దొర‌క‌క‌పోతే.. ర‌ష్మిక‌ను ఎంపిక చేయాల‌ని ఫిక్స్ అయిపోయార‌ట‌. దీంతో ఆ ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్ల‌లో ఎవ‌రు ఎంపిక అవుతార‌న్న‌ది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది. ఏదేమైనా ఎన్టీఆర్‌తో జ‌త క‌ట్టే ఆ ల‌క్కీ లేడీ ఎవ‌రో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.