ఫిట్‌నెస్ కోచ్‌తో స్టార్ హీరో కూతురు ప్రేమాయ‌ణం…!

బాలీవుడ్ కింగ్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల తాను నాలుగేళ్లు డిప్రెష‌న్‌లో ఉన్నాన‌ని చెప్పిన ఐరా.. ఆ త‌ర్వాత 14 ఏళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఐరా ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

 

 

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఐరా ఇప్పుడు అమీర్ ఖాన్‌ ఫిట్నెస్ కోచ్ నుపూర్ శిఖారెతో ప్రేమాయణం నడుపుతున్నట్టు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమిర్ జిమ్ ట్రైనర్ అయిన నుపూర్ లాక్‌డౌన్ సమయంలో ఐరా చేత కూడా వర్కవుట్లు చేయించాడట.

 

ఆ సమయంలోనే వీరి ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వీరి ప్రేమను ఐరా తల్లి రీనా దత్తా గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డంతో.. ఇటీవ‌ల మహాబలేశ్వర్ లోని అమీర్ ఖాన్ ఫామ్ హౌస్ లో వీళ్లిద్దరూ కలిసి పార్టీ కూడా చేసుకున్నార‌ని తెలుస్తోంది. కాగా, ఐరా ఖాన్ గతంలో మిషాల్ కృపలానితో ప్రేమాయ‌ణం న‌డిపించింది. అయితే మిషాల్‌తో రెండేళ్లు రిలేష‌న్‌లో ఉన్న ఐరా.. గత ఏడాది డిసెంబర్లో అత‌డికి బ్రేక‌ప్ చెప్పింది.