సీక్రెట్ పెళ్లితో స‌డెన్ షాక్ ఇచ్చిన క‌ళ్యాణ్‌రామ్ హీరోయిన్‌…!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా 2010లో వ‌చ్చిన `కత్తి` చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌రిచ‌మైంది సనా ఖాన్. ఆ త‌ర్వాత గగనం, మిస్టర్ నూకయ్య, దిక్కులు చూడకు రామయ్య వంటి చిత్రాల్లో న‌టించినా.. ఈ అమ్మ‌డుకు పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. మ‌రోవైపు హిందీ, తమిళ సినిమాల్లో నటించినా క‌లిసి రాలేదు.

 

 

 

ఇక హిందీ బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న స‌నా ఖాన్‌.. బాగానే క్రేజ్ ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అందాలు ఆర‌బోస్తూ.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ గుజరాత్ కు చెందిన ముఫ్తీ అనాస్ అనే యువకుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అంద‌రికీ స‌డెన్ షాక్‌ ఇచ్చింది.

 

 

ప్ర‌స్తుతం సనా ఖాన్‌ పెళ్లి కుమార్తె దుస్తుల్లో ఉన్న ఫొటోలు, నూత‌న వ‌ధూవ‌రులు క‌లిసి వెడ్డింగ్ కేక్ క‌ట్ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా, కేవలం దగ్గరి కుటుంబీకుల మధ్య ముస్లిం సంప్రదాయం ప్రకారం సనా ఖాన్‌-ముఫ్తీ అనాస్ వివాహం జరిగినట్టు తెలుస్తోంది.