న‌య‌న‌తార రేటు చుక్క‌ల్లోనే…. నిర్మాత‌ల క‌ళ్లు జిగేల్‌…!

సౌత్ ఇండియా లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార ద‌క్షిణాదిలో అంద‌రూ స్టార్ హీరోల‌తో హిట్ సినిమాలు చేసి త‌న కంటూ ఓ బ్రాండ్ వేల్యూ క్రియేట్ చేసుకుంది. ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా హిట్ అవ్వ‌డంతో ఆమె రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదంటున్నారు. ఆమెకు ఉన్న డిమాండ్‌ను బ‌ట్టి ఆమె అడిగినంత ఇచ్చేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు సైతం ఓకే చెపుతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆమె హీరోయిన్‌గా ఉంటే సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంటుంద‌ని.. స్టార్ హీరోలు సైతం ఆమే కావాల‌ని ప‌ట్టుబ‌డుతుండ‌డ‌మే.

 

ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెపుతున్నా ఆమె మాత్రం సినిమా ప్ర‌మోష‌న్ల‌కు రాదు… ఎక్క‌డా ఇంట‌ర్వ్యూలు కూడా ఇవ్వ‌దు. అందుకు ఓకే చెపితేనే ఆమె సినిమాకు సైన్ చేస్తోంద‌ట‌. ఆమె కండీష‌న్ల‌తో అంద‌రి క‌ళ్లు బైర్లు క‌మ్ముతోన్న ప‌రిస్థితి. ఆమె ఇటీవ‌ల న‌టించిన అమ్మోరు త‌ల్లి సినిమాకు ఆమె ఏకంగా రు. 4 కోట్లు డిమాండ్ చేయ‌గా ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా అంత ఇచ్చుకున్నార‌ట‌. నటుడు ఆర్‌.జె.బాలాజీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను న‌య‌న‌తార సింగిల్ హ్యాండ్‌తో న‌డిపించింది.

 

దీంతో ఆమె అడిగిన‌ట్టుగా రు. 4 కోట్లు నిర్మాత‌లు స‌మ‌ర్పించుకున్నార‌ట‌. తమిళ్‌లోనే కాకుండా… తెలుగులో కూడా ఆమె చెపుతోన్న రేటు చుక్కల్లో ఉండ‌డంతో పాటు, ఆమె కండీష‌న్లు చూసే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు వెన‌కా ముందు ఆడుతోన్న ప‌రిస్థితి ఉంది.