తార‌క్ ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లు పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు విషెస్ చెప్ప‌డంతో పాటు ఎన్టీఆర్ రికార్డుల‌ను గుర్తు చేసుకుంటున్నారు. బుడ్డొడిగా సినిమాల్లోకి వ‌చ్చి బాక్సాఫీస్ బాద్ షా అయ్యాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఎన్టీఆర్‌కు విషెస్ చెపుతున్నారు. ఇక ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ ప్ర‌స్థానానికి సంబంధించి రూపొందించిన డీపీ కూడా ట్రెండ్ అవుతోంది.

జూనియ‌ర్ న‌టించిన తొలి సినిమా నిన్ను చూడాల‌ని 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యింది. ఆ సినిమాను ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రామోజీరావు నిర్మించ‌గా.. వీఆర్‌. ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌వీనా రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమా అనుకున్నంత‌గా ఆడ‌క‌పోయినా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఆ సినిమాతో ఓ క్రేజీ హీరో ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ ఎన్టీఆర్ రేంజ్‌ను మార్చేసింది.

ఇక నిన్ను చూడాల‌ని సినిమాకు గాను ఎన్టీఆర్ అందుకున్న రెమ్యున‌రేష‌న్ రు. 6 ల‌క్ష‌ల‌ట‌. అలా తొలి సినిమాకు ఎన్టీఆర్ అంత రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్టూడెంట్ నెంబ‌ర్ 1, సింహాద్రి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల త‌ర్వాత ఎన్టీఆర్ చిన్న వ‌య‌స్సులోనే తిరుగులేని క్రేజీ హీరో అయ్యాడు.