రామ్ రెడ్ సినిమాకు మామూలు దెబ్బ కాదుగా…!

యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ గ‌తేడాది ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌నోడు రెడ్ సినిమాలో న‌టించాడు. ఈ సినిమా టీజ‌ర్లు సినిమాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెంచేశాయి. అన్ని బాగానే ఉన్నాయి. క‌రోనా దెబ్బ‌తో సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా కూడా రిలీజ్ చేయ‌లేని ప‌రిస్థితి. ఓటీటీలో వ‌దిలేద్దామా ? అంటే క‌లెక్ష‌న్లు రావేమో ? అన్న ఆందోళ‌న‌ల‌తో నిర్మాత‌లు వ‌డ్డీలు పెరుగుతున్నా థియేట‌ర్ రిలీజ్ కోస‌మే వెయిట్ చేస్తున్నారు.

ఇక కొన్ని సినిమాలు ఇప్ప‌టికే ఓటీటీలో రిలీజ్ కాగా.. రెడ్ మాత్రం గంద‌ర‌గోళంలోనే ఉంది. రామ్ కూడా త‌న సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ థియేట‌ర్ల‌లోనే  రిలీజ్ చేయాల‌ని పంతంతో ఉన్నాడు. ఇప్పుడు థియేట‌ర్లు ఓపెన్ అయినా జ‌నాలు వ‌స్తారా ?  రారా ? అన్న సందేహాలు అలానే ఉన్నాయి. ఈ యేడాది ఏప్రిల్ నుంచి రెడ్ రిలీజ్ వెయిటింగ్‌లోనే ఉంది. వ‌చ్చే యేడాది సంక్రాంతికి కూడా ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రాక‌పోతే ఇక ఓటీటీలో రిలీజ్ చేయ‌డం త‌ప్పా వేరే ఆప్ష‌న్ లేదంటున్నారు.

రెడ్ ఓటీటీలో వ‌స్తే అనుకున్న సొమ్ములు రావ‌ని.. ఇప్ప‌టికే భారీగా వ‌డ్డీలు పెరిగిపోవ‌డంతో ఎంతో హిట్ అయితే త‌ప్పా వ‌సూళ్లు రావ‌ని అంటున్నారు. మ‌రి రామ్ ల‌క్ ఎలా ఉందో ?  చూడాలి.  శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.