మార్నింగ్ రాగా : బంగారుమ‌యం అయిన దేశంలో  

మెథ‌డ్స్ అండ్ మోటివ్స్
జీవిత కాలాల‌ను తాక‌ట్టు పెట్టాను
య‌వ్వ‌నాల‌ను తాక‌ట్టు పెట్టాక
కానుక‌లు అన్నీ దేహం త‌న వంతు
బాధ్య‌త‌గా ఎక్క‌డో పార‌బోసి వ‌చ్చింది
కాంతుల‌నూ తోడ్కొని ప్ర‌యాణించాక
స్త్రీ వ‌స్తువుగా తోచ‌డం త‌ప్ప‌యింది

ప్రేమ వ‌స్తువుగా మారాక వినిమ‌యం ఏమీ తోచ‌క ఆగిపోయింది
వినిమ‌యం వివ‌ర్ణ స‌మూహాల‌కు లేదు వ్య‌థార్థాలకూ లేదు
దేశంలో ఓట్లు కొన్ని రాలి ప‌డ్డాక  తార‌లు  దారి త‌ప్పిపోతున్నాయి

ఇవి లెక్క‌ల్లో చెప్పాల్సినంత కావొచ్చు
లేదా లెక్క త‌ప్పినా ఇటుగా వ‌చ్చిన‌
కొన్ని కాంతుల ప్రాభ‌వం అని ఒప్పుకోవ‌చ్చు
మీ ఇష్టం ఇది మీ దేశం
అమెరికా కూడా మీ దేశ‌మే..
ప్ర‌పంచం విస్తుబోతూ మ‌న‌ల్ని ఏడ‌యినా దాచిపోతే బాగుండు

భూమ్మీద భ‌యం ఉండాలి దేవుడు ఉండాలి ఎవ్వ‌రో తేల్చారు నేను కాదు బ‌హుశా అరిస్టాటిల్ కావొచ్చు. లేదా ఇంకెవ్వ‌రో దానికో ప్ర‌తినిధిగా చెలామణీ కావొచ్చు. మ‌న  జీవితాల్లో ఏవి ఉన్నా లేకున్నా మ‌నం ఒకానొక అచేత‌న‌లో ఉంటూ దేశ స‌రిహ‌ద్దులు ఎలా ఉన్నాయో అన్న వాక‌బు ఒక‌టి చేస్తాం. హ‌క్కులూ వివ‌క్ష పూరిత ధోర‌ణులూ ఎలా ఉన్నా అమెరికా నుంచి దుబ్బాక వ‌ర‌కూ గెలిచే వారంతా శ్రేయ‌స్సును కోరి స‌మూహాల‌కు ప్రేమ‌నో సంబంధిత చ‌ర్య‌కు కొన‌సాగింపునో ఇస్తార‌న్న అపోహ‌ల్లో మీడియాతో పాటూ మ నం కూడా ఉంటాం. ఆ ద‌రిద్రం పోయే వ‌ర‌కూ అన‌గా ఆ మీడియావోడు రాసిన ద‌రిద్రం త‌గ‌లెట్టే వ‌ర‌కూ మ‌న‌కు నిజానిజాల సా మ్యం ఏంట‌న్న‌ది పాలుపోదు. కానీ మ‌నం ఆ ప‌ని చేయం.. అందాల మెల‌నియా న‌వ్వుల‌నే చూసి మురిసిపోవ‌డం నుంచి ట్రంపు గోరి భావ ప్ర‌క‌టనా స్వేచ్ఛ‌ను ప్రేమిస్తాం. లేదా అలా ప్రేమించాం అని అనుకుంటాం.

మ‌న విశ్వాసాలే అమెరికాకూ విశ్వాసాలు కొ న్ని సార్లు.. కానీ అవ‌న్నీ ఎల్ల‌కాలం చెలామ‌ణీలో ఉండవు గాక ఉండ‌వు. భ‌యాల‌ను క‌ల్ప‌నా సంబంధిత శ‌క్తులుగా భావించ‌డం మీడియా నేర్పుతుంది. మ‌నం నేర్చుకుంటాం మ‌న‌కు తెలియ‌కుండానే.. అందుకే మాయ‌దారి  రోగాల వ్యాప్తి క‌న్నా ద‌రిద్ర‌గొట్టు జీవితాల్లో భ‌యాల ఆవాహ‌న‌లే పెను విషాదాల‌ను మిగిల్చిపోతాయి.. అలాంటివే ఈ ఎన్నిక‌లు కూడా! భ‌యాల‌నూ అందుకు ఆ ధారం అనుకునే విశ్వాసాలనూ ర‌ద్దు చేయ‌ని ఎన్నిక‌లు నిన్న‌టి వేళ నా దేశంలోనూ నిన్న‌టి వేళ పొరుగు దేశంలోనూ..అయినా ఆ సిట్యువేష‌న్ లో ఇంటెన్సిటీ లేదు మీరెందుకు గొంతు చించుకుని చెబుతున్నారు అని అన్నారొక‌రు..న‌వ్వుకుంటాను. దేశం కా ని దేశంలో జ్ఞానాన్ని తాక‌ట్టు పెట్టి ఊడిగం చేయ‌డంలో ఏ తీవ్ర‌త ఉందో నా అరుపుతోనూ నా గొంతుక‌తోనూ వెల్ల‌డించ‌డం కూడా ఒక బాధ్య‌త అని భావిస్తాను. క‌నుక ఎన్నిక‌లు విల‌య కాల సంవ‌ర్త‌న‌ల‌కు సంకేతాలు.

వ‌ర్గ విభేదాల‌ను ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే….

విస్తృతం అయిన చ‌ర్యల్లో దేశాలు త‌మ‌ను తాము నిర్ణ‌యించుకుంటాయి. నిర్వ‌చించుకుంటాయి. ఇవాళ ఎవ‌డు గెలుస్తాడు అన్న ర‌చ్చ‌ను నేను ద్వేషిస్తాను. అంద‌మ‌యిన అమ్మాయిల ఆరాధన‌ల్లో అంతా గెలుస్తున్నారు. క‌నుక అందాన్నీ ఆరాధ‌నీయ ప్ర‌క్రియ కు చేరువుగా ఉంచిన‌ప్పుడు  మ‌నం గెలుపు ఓట‌ముల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోకూడ‌దు. మ‌న మూలాలు ఉన్న అమ్మాయి అవునో కాదో అవుతుందో లేదో అన్న నిర్ణ‌యం ఇంకా వెలువడ‌క మునుపే క‌మ‌లా హ్యారీస్ భార‌తీయుల‌కు ఏం చేస్తుందన్న ఆరా తీయ‌డాలు ప్రారంభం అయిపోయాయి..అస‌లు ఎవ్వ‌ర‌యినా ఏం చేస్తార‌ని..ప్రేమా,వ్యాపారం అన్న చ‌ర్య‌ల ద‌గ్గ‌ర గెలిచేది రెండోదే అ యిన‌ప్పుడు వ‌స్తువు వినిమ‌యం అన్న‌వే ప్రాధాన్యాంశాలుగా మారిన‌ప్పుడు మ‌నం ఒక‌రి ర‌క్తంలో మూలాలు వెత‌క‌డం ఓ పెద్ద పొర‌పాటు కాక ఇంకేం అవుతుంద‌ని!కానీ మ‌నం ఇలాంటివేవీ ప‌ట్టించుకోక వెళ్లిపొమ్మంటున్న దేశంలో మ‌న భ‌ద్ర‌త  ఎంత‌న్న‌ది మన కులం మ‌న మ‌తం రాణింపు ఎంత‌న్న‌ది ఆబ‌గా ఆరా తీస్తుంటాం. అలాంటి వ‌ర్గ విభేదాల‌ను ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటుం టాం.

మ‌నం ప్రేమించాలి..బ‌హుశా!
ఇంత‌కుమించిన ప్రేమ‌ను ఏదో అందుకోవాలి

దేశాల మ‌ధ్య తూరుపు గాలుల‌కూ,ప‌శ్చిమ గాలుల‌కూ మ‌ధ్య ఏమ‌యినా స‌ఖ్య‌త ఉంటే ఉండాలి..అవి ప్రేమ‌ను బ‌దులుగా తీసు కుని స్వేచ్ఛ‌ను హ‌రించ‌నీయ‌ని శ‌క్తిని ఆపాదించుకుని ఉంటే మేలు.. ఈ వేళ మెల‌నియా ప్రేమ‌లో ఉన్నాను నేను..ఇవాంకానూ ప్రే మిస్తూ పోతున్నాను..కాలాలను క్ష‌ణ సంబంధితాలుగా విభ‌జించి నేను మ‌నుషుల ప్రేమ ప‌ర్వంలో దేహాల సాహ‌చ‌ర్యంలో  ఉండ డాన్ని లేదా అలాంటి వెచ్చింపునూ ప్రేమిస్తాను. అయినా అలాంటి విభ‌జ‌నే చాలా బాగుంటుంది..జో బైడెన్ నియంతృత్వ శ‌క్తుల కు వ్య‌తిరేకంగా పోరాడ‌తాను అని చెబితే న‌వ్వుతాను. లేదా ట్రంపు ఏమ‌యినా మ‌న సుప్ర‌భాతం నేర్చుకుని మ‌న‌కే వినిపిస్తే ఇం కాస్త పొర్లి పొర్లి న‌వ్వుతాను.. అవ‌న్నీ నాకు చేత‌న‌యిన విష‌యాలే కానీ స‌మాన‌త అన్న ప‌దం ద‌గ్గర ఓడిపోయిన ప్రేమ క‌థ‌లే నా కెంతో ఇష్టం. ఇప్పుడు అలాంటి క‌థ‌లే దేశాల మ‌ధ్య న‌డుస్తున్నాయి. ప్రేమ అనే అబ‌ద్ధ‌పు నాట‌కంకు ఒక స్వ‌రాన్ని చొప్పించి  ఆ డుతున్న చోటు టిక్కెట్లు తెగ రాలిపడుతున్నాయి..బ‌హుశా!ఈ ఉల్కాపాతాన్ని మ‌నం ప్రేమించాలి.

ఆయుధాలు అమ్మేవాడు
ప్రేమ‌నూ అంగ‌ట్లో పెడ్తాడు

ఎవ‌రి కొనుగోలు సామ‌ర్థ్యం ఎంత‌న్న‌ది ఎవ‌రికి ఎరుక
దేశంలో పౌరులు దేశంలో ప్రేమ‌లు..ప్రేమ అనే ప‌దం ద‌గ్గ‌ర ప‌ద్ధ‌తిగా మెల‌నియా వ‌చ్చి వాలితే బాగుండు..ప్రేమ అనే ప‌దం ద‌గ్గ‌ర ప ‌ద్ధ‌తిగా ఇవాంకా వ‌చ్చి వాలిన చాలు.. ప్రేమ అనే ప‌దాన్ని విస్తృతం చేసిన ప్ర‌తిచోటా వీరు ఇరువురితో పాటు ఇంకెవ్వ‌ర‌యినా అ మెరికా పౌరులు వ‌చ్చి చేరితే ఇంకా బాగుండు. శ్వేత సౌధానికి వివ‌క్ష లేద‌ని, అది అంద‌రినీ క‌లుపుకుని పోతుంద‌ని భావించ‌డం లో ఉన్నంత ఉన్న‌త శ్రేణి ఆలోచ‌న నాలో లేదు.. కేవలం శృంగార భావ‌న‌లు పోత పోసుకున్న సంద‌ర్భాలూ వాటి అనుస‌ర‌ణ‌లు మాత్ర‌మే న‌న్ను క‌దిలిస్తాయి..అలా ఆ సంగీత ఝ‌రి సాయంకాలాల‌ను అర్థ‌వంంతంగా మార్చిపోయింది. ఈ త‌గువులూ కొట్లాట లూ ప‌క్కనబెట్టి ఏద‌యినా ఓ నీడ చెంత సోలిపోవాలి.. సాయంకాలాల‌ను అర్థ‌వంతంగా అమెరిక‌న్ యువ‌త‌లు మార్చినచో ఆనం దించాలి..లేదా ఆ ప్ర‌క్రియలో వారుంటే ఇంకాస్త కొన‌సాగింపు కోరుకోవాలి. మీరు ఇంతకుమించి దేశాల నుంచి కోరుకోవ‌డం భావ్యం కాదు. జ్ఞానాన్ని ఒకింత విభేదంతో కూడిన చ‌ర్య‌కు ఆపాదించి అమెరికాతో గొడ‌వ పెట్టుకోకండి.. బ‌త‌క‌లేరు. లేదంటే వాడేదో అమ్మే
ఆ న్యూక్లియ‌ర్ శ‌క్తికి మీరు దాసోహంగా మారాక నాతోవ‌చ్చి త‌గువు పెట్టుకోండి.. ఆయుధాలు అమ్మేవాడు ప్రేమ‌నూ అమ్ముతా డు కొన్ని క్వింటాల్లో కొన్ని ట‌న్నుల్లో ఉంటే ఉండ‌నీ తెచ్చి నెత్తిన పెట్టుకోవ‌డం ఈ దేశ అధ్య‌క్షులుగా కొంద‌రి బాధ్య‌త కావొచ్చు.

జీవితాల‌ను తాక‌ట్టు పెట్ట‌డం
ఓ నిరంత‌ర చ‌ర్య అడుకోవ‌డం భావ్యం కాదు

మీరంతా మ‌రింత నియ‌మంతో ప‌నిచేయాలి..మీరంతా అంబులెన్సుకు దారి ఇవ్వ‌డం త‌ప్ప‌క పాటించాలి. మీరంతా క్యూ పాటించి ప్రేమించిన వారి ఎదుట మోక‌రిల్లాలి.. ప్రేమించిన వ్య‌క్తుల జాబితాల్లో ఎవ‌రున్నారో ఆరా తీయాలి. మెలనియా ట్రంపు ద‌గ్గ‌ర ఆగి ఆలోచించాను లేదా ఇవాంకా ద‌గ్గ‌ర ఆగి ఆలోచించాను. పాతిక ల‌క్ష‌ల భార‌తీయులు అమెరికాలో నీడ‌లు దాచుకుంటున్నారు. ఎండ దేశం నుంచి పారిపోయి నీడ‌లు దాటుకుంటూ పోయి నీడ‌లు దాచుకుంటున్నారు. అయినా అమెరికాకూ మ‌న‌కూ బంధాలే తెగనివి..తెగిపోనివి. మీరు ఈ తార‌ల‌ను ఎక్క‌డ‌యినా దాచండి. దేశానికి వీరు ఉప‌యోగం ఉంటుంది. అమెరికాలోనూ ఇంకా కొ న్నిట కూడా దేశాభిమానుల‌ను కులాల వారీగా విభ‌జిస్తే మ‌న ఆటాలూ తానాలూ ఏమ‌యి ఉంటాయో అన్న‌ది కూడా తేలిపోతుం ది. దేశాన్ని ప్రేమించ‌డం అన్న చిన్న బాధ్య‌త నుంచి పారిపోయాక పౌరులు అంతా గొప్ప‌వారుగా ఎదురుగా వ‌స్తున్నారు లేదా ఎ దిగి వ‌స్త‌న్నారు. వీరంతా మాతృదేశానికి ఏదో ఒక‌టి చెప్పిపోతున్నారు. జీవిత కాలాల‌ను తాకట్టుపెట్టాక మ‌నం స్థిర‌మ‌యిన ప్రావ ‌స్థ‌ల్లో ఉన్నామ‌ని ప్ర‌వాసాన ఉన్నామ‌ని భావించి పోవాలి.

నేను మెల‌నియాను ప్రేమిస్తాను
ఇవాంకానూ ఆ జాబితాలోనే ఉంచాను

ట్రంప్ లాంటి సౌమ్య‌వాదులు..మోడీలాంటి సామ్య వాదులు మాట్లాడుకుని తీర‌డం హాయిగా ఉంటుంది. మాట్లాడ‌కుండా ఉన్నా కూడా హాయిగానే ఉంటుంది. శ్వేత సౌధంలో రాణీ గారి ఎదుట సైనింగ్ ఆఫ్ అని చెప్పి సో స్వీట్ ఆఫ్ యూ అని అధ‌రం అందు కునే  ప్ర‌య‌త్నం ఒక‌టి త‌ప్ప‌క చేయాలి. అప్పుడ‌యినా భార‌తీయ‌త నుంచి కొంత, మ‌న అనుకున్న సంస్కృతి నుంచి కొంత ఏ మ‌యినా అర్థం అయి ఉంటుంది వారికి. ప్రేమ ద‌య కారుణ్యం అన్న‌వి భార‌తీయ స‌మాజం లో కొంద‌రు ఎప్ప‌టి నుంచో వీడి బ‌తు కుతున్న నేర్ప‌రులు. అలానే ఇవాంకా కావొచ్చు లేదా మెల‌నియా కావొచ్చు.. మెల‌నియా ఇక్క‌డ‌కి వ‌చ్చి పాట‌లు వింటుంది.. ఇ వాంకా ఇక్క‌డికి వ‌చ్చి ఛాయ్ తాగి పోతుంది ఇంతే ఇంత‌కుమించి వీరు భార‌తీయులను ఎలా అర్థం చేసుకుంటున్నారో అన్న‌ది  పెద్ద ప్ర‌శ్న‌గా నాలో ఉంటుంది.. పొమ్మంటున్న దేశానికి ఇప్పుడు కొత్త కొత్త స‌వాళ్లు.. సంక్షోభాలు అయినా మ‌నం చేయాల్సిన వి లేవు.. చేయ‌కూడ‌నివేవో ఉన్నాయి.

క‌మ‌లా హ్యారీస్ అను ఆమె ఏమ‌యినా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారేమో చూడాలి..విద్వేష శ‌క్తుల సంస్క‌ర‌ణ‌కు పూనిక వ‌హించిన అధ్య‌క్షుడు ఎవ్వ‌రయినా ఉన్నారేమో అని ఆరాతీయండి ఏం కాదు మీకు ఇక్క‌డ బండి సంజ‌య్,అక్క‌డ ట్రంప్ కావొచ్చు.. పేర్లు మారితే ఏం కాదు దేశం మారినా ఏం కాదు.. మ‌నుషులు త‌మ‌ని తాము  వెలివేసుకుని ప్ర‌యాణించినా ఏం కాదు ఏదో ఒక‌టి ప్ర‌జ‌ల్లో లేని చింత‌న ప్ర‌జ‌ల్లో లేని ప‌రివ‌ర్త‌న నాయ‌కుల్లో కోరుకుని న‌ది చెంత క‌లుషితాల‌ను వెలివేయ‌మ‌ని కోర‌డం చాలా త‌ప్పు. మీరు ఆ.. దేశాన్ని ప్రేమించండి నేను మెల‌నియాను మాత్ర‌మే ప్రేమిస్తాను. అలాంటి ప్రేమ‌లు మాత్ర‌మే కోరుకుని దేహాల‌కు ఇంతటి న‌మ్మ‌కాల‌ను అల‌వ‌ర్చే ప్ర‌య‌త్నం ఒక‌టి త‌ప్ప‌క చేస్తాను. ప్రేమ మిగిలిన వ‌స్తువులు అ న్నింటి క‌న్నా చేరువుగా ఉంటుంది. బాధ వినిమ‌యంలోకి వ‌చ్చాక ప్రేమ తీవ్ర‌త‌ల స్థాయి ఒక‌టి అంచనాకు వ‌స్తుంది. దేశాలు వీ టిని అన్నింటినీ మ‌న‌కు అల‌వాటు చేశాకే వ్యాపారం మొద‌లుపెడ్తాయి. ఈ వ్యాపారం లో భార‌తీయులు భాగం పంచుకుంటారు. అమెరికా నుంచి ఇంకా కొన్ని దేశాలు స్నేహాస్తం అందుకుంటాయి. మృత్య‌దేవ‌త‌ను కొనుగోలు చేయ‌డమే ఇవాళ్టి భార‌తీయం.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

ఆర్ట్ : బాబు దుండ్ర‌పెల్లి