ఆటోడ్రైవ‌ర్ పెళ్లాంతో క‌ర్నూలు రాజ‌కీయ నేత రాసలీల‌లు… ఇలా బుక్ అయ్యాడు..!

తాను ఓ బ‌డా రాజ‌కీయ నేత‌ను అని.. త‌న‌కు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు అధికారుల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని.. మీకు కావాల్సిన ప‌నులు చేసిపెడ‌తానంటూ ఓ వ్య‌క్తి ఆటోడ్రైవ‌ర్ పెళ్లాంతో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. క‌ర్నూలు జిల్లాలోని ఆళ్ల‌గ‌డ్డ‌కు చెందిన ఓ వ్య‌క్తి ఆటో న‌డుపుకుంటూ స్థానికంగా ఉంటున్నాడు. స్థానికంగానే ఉండే ఓ నేత మాయ‌మాట‌లు చెప్పి ఆ ఆటోడ్రైవ‌ర్ భార్య‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. నేను రాజ‌కీయ నేత‌ను మీకు కావాల్సిన ప‌నులు చేసి పెడ‌తాన‌ని ఆమెను లోబ‌ర‌చుకుని రాస‌లీల‌లు కొన‌సాగిస్తూ వ‌స్తున్నాడు.

 

ఈ విష‌యం స్థానికులు ద్వారా తెలుసుకున్న ఆటోడ్రైవ‌ర్ భార్య‌ను ఆ నేత‌తో వివాహేత‌ర సంబంధం మానుకోవాల‌ని వార్నింగ్ ఇచ్చినా వారి తీరు మార‌లేదు. దీంతో వారికి బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న ఆటోడ్రైవ‌ర్ తాజాగా మాటు వేసి వారు రాస‌లీల‌ల్లో ఉండ‌గానే పోలీసుల‌కు ప‌ట్టించాడు. పోలీసులు స‌ద‌రు నేత‌ను ప‌ట్టుకుని క‌టాక‌టాల వెన‌క్కు నెట్టారు. త‌న భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు కావడంతో ఆ ఆటోడ్రైవ‌ర్ భార్య లోబ‌దిబో మ‌న‌డంతో పాటు.. త‌న‌కు స‌ద‌రు వ్య‌క్తి మాయ‌మాట‌లు చెప్పాడ‌ని… త‌న‌కేం తెలియ‌ని నాట‌కం ఆడింది.