ఫ‌స్ట్ ప్ర‌యార్టీ దానికే అంటోన్న ఎంపీ రామ్మోహ‌న్‌

విద్య, వైద్యం రంగాల‌కు చేయూత నిచ్చేందుకు,మారుమూల ప్రాంతాల్లో క‌నీస వ‌స‌తుల క‌ల్ప‌న‌కు త‌నకు కేటాయించిన నిధులు వెచ్చించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. సంబంధిత కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా క‌రో నా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న త‌రుణాన ఇప్పటి అవ‌స‌రాల దృష్ట్యా మూడు అంబులెన్స్ ల‌ను త‌నకు కేటాయించిన నిధుల నుం చి కొనుగోలు చేసి  క‌లెక్ట‌ర్ నివాస్ కు  అందించారు యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. అదేవిధంగా ఎచ్చెర్ల కేంద్రంగా న‌డుస్తున్న బీఆర్ఏయూ విద్యార్థులు రాక‌పోక‌లు సాగించేందుకు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చి,ఎప్ప‌టి నుం చో ఉన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి సంబంధిత వ‌ర్గాల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆ వివ‌రాలివిగో..

 

శ్రీ‌కాకుళం : సామాజిక‌త‌కు ప్రాధాన్యం ఇస్తూ మొద‌టి నుంచి నిధుల కేటాయింపు చేప‌డుతున్నామ‌ని, త న‌కు  కేటాయించిన లోక‌ల్ ఏరియా ఫండ్స్ ను ఇప్ప‌టి అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్ లు, అదేవిధంగా బీఆర్ ఏ యూ విద్యార్థులు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ఒక బ‌స్సును కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చాన‌ని ఎంపీ రామూ చెప్పారు. స్థానిక క‌లెక్ట‌రేట్ ప్రాంగణంలోఈ వాహ‌నాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ నివాస్ కు, వ‌ర్శిటీ అధికారుల‌కూ అందించి శుభాకాంక్షలు తెలిపారు. తాను అందించిన అంబులెన్స్ ల‌ను సీతంపేట ప‌రిస‌ర ప్రాంత గిరిజనులకు వైద్య సదుపాయాల నిమిత్తం అక్క‌డి ఐటీడీఏకు, రి మ్స్ హాస్పిటల్, జిల్లా ప్రజలు కోసం డీఎంహెచ్ఓ ఆఫీసు సిబ్బంది, జిల్లా ప్రజలు కోసం వినియోగించాల‌ని కోరారు.

 

 

అదేవిధంగా వ‌ర్శిటీ విద్యార్థులు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా వారి కోసం ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించేందుకు నిర్ణ‌యించామ‌‌ని, వారి ఇబ్బం దులు దృష్టిలో ఉంచుకుని స‌మ‌స్య ప‌రిష్కారార్థం బ‌స్సు కొనుగోలు చేశామ‌ని వివరించారు. క‌లెక్ట‌ర్ స‌మ‌క్షంలో వీటిని ప్రారంభించి, సంబంధిత జిల్లా యంత్రాంగంతోనూ, వ‌ర్శిటీ అధికారుల‌తో ఆత్మీయంగా ముచ్చ‌టించారు. వ‌ర్శిటీ మ‌రింత ప్ర‌గ‌తి సాధించాల‌ని ఆ కాంక్షించారు. అదేవిధంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న త‌రుణాన చిత్తుశుద్ధితో అహ‌ర్నిశ‌లూ శ‌క్తి వంచ‌న లేకుండా ప‌నిచే స్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. త‌న త‌ర‌ఫున ఏ సాయం కావాల‌న్నా సంబంధిత వ‌ర్గాల‌కు అందించేందుకు తా నెన్న‌డూ సిద్ధ‌మేనని హామీ ఇచ్చారు.