టాలీవుడ్‌లో మ‌గాళ్ల‌ను కూడా ప‌క్క‌లోకి పిలుస్తారా… సంచ‌ల‌న నిజం..!

గ‌త కొద్ది రోజులుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్‌ కౌచ్ అనే ప‌దం ఎంత సంచ‌ల‌నం సృష్టించింతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంది. సినిమాల్లో అవకాశం ఇచ్చేందుకు.. అమ్మాయిల‌పై దారుణంగా లాంగిక దాడికి దిగుతున్నారు ప్ర‌ముఖులు. ఇక ఇప్పటికే చాలా మంది తారలు ఈ అంశం మీద బహిరంగంగా గళం విప్పుతూ.. నిజానిజాలని బయట పెడుతున్నారు.

 

 

అయితే కేవ‌లం ఆడ‌వారే కాదు.. అబ్బాయిలు కూడా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటార‌న్న‌ సంచ‌ల‌న విష‌యం బిగ్ బాస్ ఫేమ్ మ‌హేష్ విట్టా బ‌య‌ట పెట్టాడు. యూ ట్యూబ్ నుంచి సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎదిగిన మ‌హేష్ విట్టా బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని ఫుల్ పాపుల‌ర్ అయ్యారు. అయితే మ‌హేష్ విట్టా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌తో పాటు మ‌గ‌వాళ్లు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నార‌ని హాట్ కామెంట్స్ చేశాడు.

 

 

మ‌హేష్ మాట్లాడుతూ.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన మొద‌ట్లో త‌న స్నేహితుడు మంచి ప‌ర్స‌నాలిటీతో పాటు చాలా అందంగా ఉండేవాడు. అత‌డు సినిమాల్లో అవ‌కాశాల‌ కోసం చూస్తున్న స‌మ‌యంలో ఓ ప్రొడెక్ష‌న్ హౌస్ క‌మిట్మెంట్ ఇస్తే అవ‌కాశాలు ఇస్తామ‌ని అన్నార‌ట‌. దీని బ‌ట్టీ న‌టీన‌టులు ఎలాంటి ప‌రిస్థితులో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని మ‌హేష్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అందుకే అవ‌కాశాలు కోసం ఏమైనా చేసే వారిని లొంగ‌తీసుకునే వారితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు మ‌హేష్‌.