ఆ యువ హీరోతో డేట్‌… ప్రేమ‌పై హింట్ ఇచ్చేసిన కియారా..!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ హీరోగా వ‌చ్చిన‌ `భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కియారా.. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ చిత్రం త‌ర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కియారా న‌టించ‌లేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస అవ‌కాశాల‌తో ఛాన్సులు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

 

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం కియారాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ వ‌ర్గాల్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం సాగిస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ప్ర‌స్తుతం అత‌డితో డేటింగ్‌లో ఉంద‌ని.. ఈ క్ర‌మంలోనే వీళ్లిద్దరు లేట్ నైట్ పార్టీస్ చేసుకుంటున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌లకు బ‌లం చేకూరుస్తూ.. కియారా త‌న ప్రేమ‌పై తాజాగా ఓ హింట్ ఇచ్చింది.

 

 

ప్ర‌స్తుతం కియారా న‌టిస్తున్న ఇందూకీ జవానీ’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కియారా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్రైలర్ లింక్ పై సిద్దార్థ్ స్పందిస్తూ ‘ఇందూ ఫుల్ ఫైర్ లో ఉంది.. చూడ్డానికి వెయిట్ చేస్తున్నామ’ని ట్వీట్ చేశాడు. దీనికి కియారా, ఇందూ కూడా నిన్ను చూడ్డానికి ఎదురుచూస్తోందని రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏడో న‌డుస్తుంద‌ని నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.