పెళ్లి పీట‌లెక్కుతోన్న మ‌రో యంగ్ హీరోయిన్‌..!

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో.. సెల‌బ్రెటీలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెళ్లి పీట‌లెక్కేస్తున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో నితిన్‌, నిఖిల్‌, రానా ద‌గ్గుబాటి, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇలా ప‌లువ‌రు సెల‌బ్రెటీలు త‌మ లైఫ్ పార్ట్నర్‌ను వెతుక్కుని వివాహం చేసేసుకున్నారు. అయితే ఇప్పుడు మ‌రో యంగ్ హీరోయిన్ కూడా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంద‌ట‌.

 

 

ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. ర‌హస్య గోరక్. రవికిరణ్ కోలా దర్శకత్వంలో కిరణ్ అబ్బావరమ్ హీరోగా వ‌చ్చిన `రాజావారు రాణిగారు` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ర‌హ‌స్య గోర‌క్‌ ప‌రిచ‌మైంది. ఎస్‌ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకోగా.. ర‌హ‌స్య గోర‌క్‌కు మంచి క్రేజ్ కూడా ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే మ‌రిన్ని ఆవ‌క‌శాలు కూడా త‌లుపుత‌ట్టాయి.

 

 

అయితే ఇంత‌లోనే ర‌హ‌స్య త‌న చిన్న‌నాటి స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. అంతేకాదు, ఇటీవల ఆమె పెళ్ళికూతుర్ని చేసే వేడుక కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఏదేమైనా మంచి హిట్ చేతిలో పెట్టుకొని, బోలెడన్ని ఆఫర్లు కూడా వస్తున్నా తరుణంలో ర‌హ‌స్య పెళ్లికి రెడీ అవ్వ‌డం అంద‌రినీ షాక్‌కి గురి చేస్తోంది.