ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా… హుషారెత్తించే అప్‌డేట్…!

లాక్‌డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి క్రేజీ ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఓ కొలిక్కి వ‌చ్చేసి ఉండేది. ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉండేది. ఎప్పుడు అయితే లాక్‌డౌన్‌తో ఏడు నెలల పాటు షూటింగ్‌లు ఆగాయో ఆర్ ఆర్ ఆర్ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా ఉంది. రీసెంట్‌గా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సెట్స్ పైకి వ‌చ్చింది. ఆర్ ఆర్ ఆర్ వాయిదా ప‌డ‌డంతో వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు రెడీ కావాల్సిన ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా ప‌రిస్థితి అయోమ‌యంగా మారింది.

 

సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్‌, స‌మ్మ‌ర్‌కు ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు అని ఎన్టీఆర్‌, టాలీవుడ్ ఫ్యాన్స్ ముందు సంబ‌రాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ?  త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడు సెట్స్ మీద‌కు వ‌స్తుందో ?  తెలియ‌క గంద‌ర‌గోళంలో ఉన్నారు. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్న ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ ప్రాజెక్టుపై ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది.

 

ఎన్టీఆర్ వ‌చ్చే మార్చికి ఫ్రీ అయిపోవ‌చ్చని తెలుస్తోంది. ఆ వెంట‌నే త్రివిక్ర‌మ్‌తో కంటిన్యూగా ట్రావెల్ చేసి వ‌చ్చే యేడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. వ‌చ్చే ద‌స‌రా లేదా దీపావ‌ళికి ఈ సినిమా తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. షూటింగ్ ప్రారంభించిన వెంట‌నే హీరోయిన్ పేరును ప్ర‌క‌టించ‌నున్నారు.