ప్రియురాలితో భార్య‌కు దొరికేశాడు… రెండో అంత‌స్తు నుంచి దూకేశాడు

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం అయిన తిరుప‌తితో ఓ భ‌ర్త రాస‌లీల‌ల బాగోతాన్ని భార్య ర‌ట్టు చేసింది. ప్రియురాలితో ఉన్న భ‌ర్త‌ను ప‌ట్టుకునేందుకు స‌ద‌రు భార్య త‌న బంధువుల‌తో క‌లిసి వాళ్లిద్ద‌రు ఉన్న ఇంటికి వెళ్లింది. తిరుపతికి చెందిన చంద్రమౌళి భార్య ఉండగానే వేరే యువతితో తిరుపతి పద్మావతి నగర్ లో ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే చంద్ర‌మౌళి గతంలో కూడా ఓ సారి కాల్‌మ‌నీ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి వ‌చ్చాడు.

 

 

త‌న భ‌ర్త ప‌లువురు యువ‌తుల‌కు గ‌తంలోనే డ‌బ్బు ఆశ చూపించి అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్నాడ‌ని భార్య ఆరోపిస్తోంది. ఇక బంధువుల‌తో క‌లిసి ప్రియురాలితో ఉన్న భ‌ర్త ఇంటికి వెళ్ల‌గా భ‌య‌ప‌డ్డ చంద్ర‌మౌళి రెండో అంత‌స్తు నుంచి కింద‌కు దూకి పారిపోయాడు. స‌ద‌రు వ్య‌క్తి కింద‌కు దూకుతోన్న వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. భ‌ర్త పారిపోవ‌డంతో భార్య త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆ ఇంటిముందే బైఠాయించి ఆందోళ‌న చేస్తోంది.