రామ్‌చ‌ర‌ణ్‌పై క‌న్నేసిన కుర్ర హీరోయిన్… బుట్ట‌లో పెట్టే డైలాగ్ వేసిందిగా…

మంగుళూరు బ్యూటీ కృతిశెట్టి టాలీవుడ్లో ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. తొలి సినిమా రిలీజ్ కాకుండానే ఆమె స్టిల్స్‌కు యూత్‌లో మంచి క్రేజ్ వ‌చ్చింద‌న్న‌ది నిజం. అయితే కృతి అప్పుడే క్రేజీ హీరోల‌ను గురిపెట్టి వారిని బుట్ట‌లో పెట్టే మాట‌లు వ‌దులుతోంది. చూడ‌డానికి కైపెక్కించే అందంతో ఉన్న కృతి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న‌కు టాలీవుడ్‌లో రామ్‌చ‌ర‌ణ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని ఓ బిస్కెట్ వేసింది.

 

 

కృతి మాట‌లు వింటే ఆమెకు రామ్‌చ‌ర‌ణ్‌తో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉంద‌ని తేలిపోయింది. ప్ర‌స్తుతం తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, బ‌న్నీకు స‌రైన క్రేజ్ ఉన్న హీరోయిన్లు లేక పూజ‌హెగ్డే, ర‌ష్మిక లాంటి వాళ్ల‌నే రిపీట్ చేస్తున్నారు. కృతిలో ఏ మాత్రం అభిన‌యం ఉన్నా ఆమెకు స్టార్ హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌డం ఖాయం. ఇప్ప‌టికే మెగా మేన‌ళ్లుడు ప‌క్క‌న డెబ్యూ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న కృతి మ‌రో మెగా హీరో చ‌ర‌ణ్ ప‌క్క‌న ఛాన్స్ కోస‌మే ఈ బిస్కెట్ డైలాగ్ వేసింద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

 

ఏదేమైనా కృతికి ఒక‌టి రెండు హిట్లు ప‌డినా ఆమెకు మ‌హేష్‌, ఎన్టీఆర్ ప‌క్క‌న సులువుగానే ఛాన్స్ వ‌స్తుందంటున్నారు. మ‌రి కృతికి టాలీవుడ్‌ను ఏలే ల‌క్ ఉందో ?  లేదో ?  ఆమె తొలి రెండు మూడు సినిమాల రిజ‌ల్టే చెపుతుంది.