పాలిటిక్స్‌లోకి అల్లు అర్జున్‌.. తెర‌వెన‌క అత‌డిదే చ‌క్రం…!

టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ పాలిటిక్స్‌లోకి రాబోతున్నారా అంటే.. అవున‌నే సమాదాన‌మే వినిపిస్తోంది. అయితే రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్ రీల్ లైఫ్‌లో అల్లు అర్జున్ రాయ‌కీయ నాయ‌కుడిగా మార‌బోతున్నాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

 

 

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఎప్పటిలాగే శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమాతో కూడా కొర‌టాల ప్ర‌జ‌ల‌కు మంచి మెసేజ్ ఇవ్వ‌నున్నాడ‌ట‌.

 

 

ఇక తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో బ‌న్నీ స్టూడెంట్‌గా మ‌రియు పొలిటిక‌ల్ లీడ‌ర్‌గానూ క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలాగే ఈ చిత్రంలో కొర‌టాల పేద‌రికం, నిర‌క్ష‌రాస్య‌త గురంచి ప్ర‌స్తావించ‌నున్నాడ‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. కాగా, ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, జి ఏ 2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.