వ‌రుణ్ తేజ్ కొత్త రేటు అన్ని కోట్లా… టాలీవుడ్‌కే షాక్ ఇచ్చేలా…!

గ‌త ఏడాది వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎఫ్ ‌2` సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్కెల్‌గా ఎఫ్ 3 రాబోతోంది. డిసెంబర్ 14 నుంచి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

 

 

 

ఎఫ్‌ 2లో నటించిన వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌లే ఈ సీక్వెల్‌లో భాగం కానున్నారు. అయితే ఈ సినిమాకి హీరోలు మరియు డైరెక్టర్ నుంచి డిమాండ్స్ ఎక్కువ అయ్యాయని నెట్టింట్లో ప్ర‌చారం ఊపందుకుంది. ముఖ్యంగా వ‌రుణ్ తేజ్ వెంకీతో స‌మానంగా త‌న‌కూ రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌ని మ‌రియు త‌న పాత్ర ప్రాధ‌న్య‌త కూడా స‌మానంగానే ఉండాల‌ని డిమాండ్ చేశాడ‌ట‌.

 

 

అయితే ఎఫ్ 3కి గానూ రూ. 13 కోట్ల వరకు వెంకీకి ముట్టేలా ఇప్ప‌టికే నిర్మాత‌లు ఒప్పందం చేసుకున్నార‌ని బోగట్టా. ఇక ఎప్పుడైతే వెంకీతో డీల్ కుదిరిందో అదే విధంగా తనకు ఇవ్వాలని వరుణ్ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్ర‌స్తుతం వ‌రుణ్ కొత్త రేటు టాలీవుడ్‌కే షాక్ ఇచ్చేలా ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. ఏదేమైనా ఇప్ప‌టి వ‌ర‌కు సోలోగా ఒక్క‌ భారీ హిట్ కూడా సాధించ‌లేని వ‌రుణ్‌కు 13 కోట్లు అంటే నిజంగా ఆశ్చ‌ర్య‌మే అని చెప్పాలి.