ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ నుంచి విజ‌య్ సేతుప‌తి అవుట్‌.. అదే కార‌ణ‌మా..

ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బ‌యోపిక్ 800 సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు 800 టైటిల్ కూడా ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే మోష‌న్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఈ క్రేజీ బ‌యోపిక్‌లో ముర‌ళీధ‌ర‌న్‌గా కోలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నాడ‌ని రివీల్ చేయ‌డంతో పాటు అత‌డి లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 

 

శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళులను అణచివేస్తోన్నందున‌.. జాతి వివ‌క్ష పాటించే ఓ క్రికెట‌ర్ బ‌యోపిక్‌లో న‌టిస్తారా ? అని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అలాగే ట్విట్ట‌ర్‌లో షేమ్ ఆన్ విజయ్ సేతుపతి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో ముర‌ళీధ‌ర‌న్ త‌న బ‌యోపిక్‌లో న‌టించ‌వ‌ద్ద‌ని.. త‌న జీవితం వివాదం కాకూడ‌ద‌ని ముర‌ళీధ‌ర‌న్ విజ‌య్‌కు ఓ లేఖ రాశాడు.

 

నా వ‌ల్ల ఓ గొప్ప త‌మిళ క‌ళాకారుడు బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని తాను కోరుకుంటున్నాన‌ని కూడా ముర‌ళీ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ లేఖ‌పై స్పందించిన విజ‌య్ థ్యాంక్యు గుడ్ బై అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మురళీధరన్ బయోపిక్ 800 నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు స్పష్టమైంది.