ఆ న‌టి మూడో భ‌ర్త‌ను త‌న్ని గెంటేసిందా… ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌..!

క‌రోనా వేళ ప్ర‌ముఖ న‌టి వ‌నిత ముచ్చ‌ట‌గా మూడో పెళ్లితో అనేక సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. సీనియర్ నటులు మంజులు-విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుని భ‌ర్త‌ల‌ను వ‌దిలేసింది. వీరిలో మొద‌టి భ‌ర్త నటుడు ఆకాశ్‌. ఇక గ‌త జూన్‌లో అంద‌రికి షాక్ ఇస్తూ ఓ ఫంక్ష‌న్ హాల్లో పీట‌ర్ పాల్ అనే ద‌ర్శ‌కుడిని మూడో పెళ్లి చేసుకుంది. ఇక అత‌డితోనే నా జీవితం అంటూ పెద్ద స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.

 

అయితే పీట‌ర్ పాల్ నాకు విడాకులు ఇవ్వ‌కుండానే మ‌రో పెళ్లి చేసుకున్నాడంటూ అత‌డి మొద‌టి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో అప్ప‌ట్లోనే పోలీసులు ఈ ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేశారు. మ‌రి కొంద‌రు వనిను తిడితే ఆమె వాళ్ల‌పై చిర్రుబుర్రు లాడింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం వనిత త‌న మూడో భ‌ర్త పీట‌ర్‌ను ఇంటి నుంచి గెంటేసింద‌ట‌.

 

ఈ విష‌యం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై వనిత విజయ్ కుమార్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. అయితే చాలా మంది మాత్రం ఇల్లీగ‌ల్ మ్యారేజ్ చేసుకున్నందుకు త‌గిన శాస్తే జ‌రిగింద‌ని కౌంట‌ర్లు వేస్తున్నారు.