కేసీఆర్ కూతురు పెళ్లి వెన‌క చాలా ట్విస్టులే ఉన్నాయ్‌..

కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూష వివాహంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. కేసీఆర్ ద‌త్త‌పుత్రిక అంటే చాలా మంది ఈపాటికే మ‌ర్చిపోయి ఉంటారు. పిన‌త‌ల్లి క‌ర్క‌శ‌త్వానికి ఎంతో క్రూరంగా హింసించ‌బ‌డిన ఆమె ద‌య‌నీయ స్థితి తెలుసుకున్న కేసీఆర్ చివ‌ర‌కు స‌తీ స‌మేతంగా హాస్ప‌ట‌ల్‌కు వెళ్లి… చివ‌ర‌కు త‌న కుమార్తె క‌విత‌ను కూడా వెంట తీసుకుని వెళ్లి ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్ప‌డంతో పాటు నువ్వు నా కుమార్తెవు అని ధైర్యం చెప్పారు. చివ‌ర‌కు ఇంటికి పిలిచి భోజ‌నం కూడా పెట్టాడు.

ఆమె సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను కేసీఆర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ర‌ఘునంద‌న్‌రావుకు అప్ప‌గించారు. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ఆయ‌న బాధ్య‌త‌లు చూసింది. ఐదేళ్ల‌లో ఆరోగ్య ప‌రంగా, విద్యాప‌రంగా ఎదిగిన ప్ర‌త్యూష రాంన‌గ‌ర్‌కు చెందిన చ‌ర‌ణ్‌రెడ్డిని మ‌నువాడ‌నుంది. ఆమె ఎంగేజ్‌మెంట్ చ‌ర‌ణ్‌రెడ్డితో జ‌రిగింది. మ‌మ‌త‌, మ‌ర్‌రెడ్డి దంప‌తుల కుమారుడు అయిన చ‌ర‌ణ్ ఓ ప్రైవేటు సంస్థ‌లో ప‌ని చేస్తున్నాడు. ప్ర‌త్యూష గురించి తెలుసుకుని వారే ఆమెను వివాహం చేసుకునేందుకు సంప్ర‌దించారు.

చివ‌రకు ప్ర‌త్యూష ఇందుకు ఒప్పుకుంది. మ‌హిళా సంక్షేమ అధికారులు ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల‌కు చెప్పారు. వారు కేసీఆర్ దృష్టికి విష‌యం తీసుకువెళ్లారు. కేసీఆర్ ప్ర‌త్యూష‌ను పిలిపించుకుని మాట్లాడారు. ప్ర‌త్యూష పెళ్లాడే యువ‌కుడి వివ‌రాలు తెలుసుకుని సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లాల‌ని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య‌ను ఆదేశించారు. అది ఈ పెళ్లి వెన‌క క‌థ‌.