నంద‌మూరి హీరో సినిమా టైటిల్ వ‌చ్చేసింది.. సార‌ధి

నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న హీరోగా పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమాకు సారధి టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ లుక్ రిలీజ్ చేశారు. తార‌క‌ర‌త్న స‌ర‌స‌న హీరోయిన్‌గా కోన శ‌శిత న‌టిస్తోంది. ఫస్ట్ లుక్‌, మోషన్‌ పోస్టర్ 25న రిలీజ్ చేస్తారు. సార‌ధి సినిమా ఖోఖో క్రీడ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ట్టు ద‌ర్శ‌కుడు జాక‌ట ర‌మేష్ చెప్పారు. సినిమాలో తార‌క‌ర‌త్న చాలా డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తార‌ని చెప్పారు.

 

గ‌తంలో ఇదే ద‌ర్శ‌కుడు ఖోఖో నేప‌థ్యంలోనే ర‌థేరా సినిమా నిర్మించ‌గా.. జ‌న‌వ‌రిలో వ‌చ్చిన ఆ సినిమాకు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల‌ కడపలో తీసిన షెడ్యూల్‌తో సినిమా ప్రధాన షూటింగ్ పార్ట్ పూర్తయింది. క‌రోనా నేప‌థ్యంలో కూడా తార‌క‌ర‌త్న సాహ‌సం చేసి ఈ సినిమా షూటింగ్‌ను ఫినిష్ చేశాడు. త్వ‌రలోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.