శింబు పెళ్లి న్యూస్ అనౌన్స్‌… 22న షాకింగ్ అప్‌డేట్‌

కోలీవుడ్ మీడియాలో గ‌త కొద్ది రోజులుగా శింబు – త్రిష పెళ్లంటూ వార్తలు జోరుగా వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో త్రిష నిర్మాణ వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాక బ్రేక‌ప్ చెప్పేసింది. పెళ్లి త‌ర్వాత కూడా తాను సినిమాలు చేస్తాన‌న్న కండీష‌న్‌కు వ‌రుణ్ ఒప్పుకోక‌పోవ‌డంతో పాటు ఈ అంశంపై ఆమెను విప‌రీతంగా టార్చ‌ర్ చేయ‌డంతోనే ఇద్ద‌రు విడిపోయార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

 

 

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే ఈ నెల 22న శింబు సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుతున్నాడు. ఇంత వ‌ర‌కు శింబుకు ట్విట్ట‌ర్ అక్కౌంట్ లేదు. ఈ నెల 22న సోష‌ల్ మీడియాలో ఎంట‌ర్ కావ‌డంతో పాటు సంచ‌ల‌న వార్త వెల్ల‌డిస్తాడ‌ని అంటున్నారు. ఇక కొంత కాలంగా త్రిష‌, శింబు వార్త‌లు కోలీవుడ్ మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

 

ఈ క్ర‌మంలోనే శింబు సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర్ కావ‌డంతో పాటు కొద్ది రోజులుగా త‌మ‌పై వ‌స్తున్న రూమ‌ర్‌ల‌కు పెళ్లి వార్త‌తో చెక్ పెట్టాల‌ని శింబు భావిస్తున్నాడ‌ని తెలిసింది