శ్రీకాంత్ చెల్లిని గుర్తు ప‌ట్టారా.. ఇంత పాపుల‌రా…!

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ చెల్లి అంటే ఎవ‌రు అని అనుకుంటున్నారా ?  శ్రీకాంత్‌కు రియ‌ల్ చెల్లి కాదు ఓ రీల్ చెల్లి ఉంది. ఆమె శిరీష దామెర ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్ చేసిన శ్రీకాంత్ న‌టించిన మ‌ల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాలో కూడా శ్రీకాంత్‌కు చెల్లిగా న‌టించింది. ఆ సినిమా త‌ర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో న‌టించినా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో చివ‌ర‌కు ఆమె బుల్లితెర సీరియ‌ల్స్‌ను న‌మ్ముకుంది.

 

స్టార్ మాలో ప్ర‌సారం అవుతోన్న చెల్లిలి కాపురం సీరియ‌ల్లో ఆమె భూమి పాత్ర‌లో న‌టిస్తోంది. మ‌తిస్థిమితం లేని చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తోన్న భ‌ర్త‌ను చూసుకునే భార్య‌గా ఆమె న‌టిస్తోంది. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన శిరీష బుల్లితెర‌పై మంచి పాపుల‌ర్ అయ్యింది. చెల్లిలి కాపురంలో ఆమె భూమి పాత్ర‌లో అలా ఒదిగిపోయింది.

 

ముందుగా జెమినీ టీవీలో ప్ర‌సారం అయిన మొగ‌లిరేకులు సీరియ‌ల్లో న‌టించిన శిరీష ఆ త‌ర్వాత దూర‌ద‌ర్శ‌న్‌లో చంద‌మామ‌, జీ తెలుగులో ఎవ‌రీ మోహినీ, రాముల‌మ్మ‌, మ‌న‌సు మమ‌త‌, అడ‌గ‌క ఇచ్చిన మ‌న‌సు, స్వాతి చినుకులు వంటి పాపుల‌ర్ సీరియ‌ల్స్‌లో న‌టించింది. ఇప్పుడు పెళ్ల‌య్యాక కూడా పిల్ల‌లు ఉన్నా చెల్లిలి కాపురంలో మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది.