పాయ‌ల్ అందాల ర‌చ్చ అందుకోస‌మేనా… మామూలు ప్లాన్ కాదే..

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్క‌సారిగా కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టేసింది హాటీ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో ప‌లు సినిమాలు చేసినా.. చివ‌ర‌కు విక్ట‌రీ వెంక‌టేష్ ప‌క్క‌న వెంకీ మామ సినిమా చేసినా ఆమెకు అనుకున్న గుర్తింపు రావ‌డం లేదు. అందాలు ఆర‌బోసినా, బోల్డ్ క్యారెక్ట‌ర్లు చేసినా.. నిత్యం సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోల‌తో నిత్యం త‌న ఫ్యాన్స్‌కు వీనుల విందు చేస్తుంటుంది.

 

కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటోన్న పాయ‌ల్ ఇటీవ‌లే తిరిగి షూటింగ్‌లలో బిజీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్ ప‌నీ పాటా లేకుండా ఇంట్లో ఉండ‌డంతో ఆమె బొద్దుగా మారింది. దీంతో ఇప్పుడు పాయ‌ల్ బ‌రువు త‌గ్గించుకోవ‌డంతో పాటు స‌న్న‌గా.. నాజుగ్గా త‌యార‌య్యేందుకు రెడీ అవుతోంది. అందుకే జిమ్‌ బాట పట్టింది.

 

తాజాగా ఆమె జిమ్ వెయ‌ర్‌లో దిగిన కొన్ని హాట్ ఫొటోల‌ను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఎలాంటి మార్పు లేనిదానికంటే నెమ్మ‌దిగా మార్పు వైపు అడుగులు వేయ‌డం మంచిది కాద‌ని క్యాప్ష‌న్ పెట్టింది. ఏదేమైనా మ‌ళ్లీ అందాల ర‌చ్చ చేస్తూ ఛాన్సులు ప‌ట్టేందుకు మంచి క‌స‌ర‌త్తులే చేస్తోంది.