నిహారిక‌ది ఎరేంజ్‌డ్ కాదు ల‌వ్ మ్యారేజే… వెంట‌ప‌డి మ‌రీ….!

మెగాడాట‌ర్ నిహారిక వివాహం ఈ డిసెంబ‌ర్లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే పెళ్లి ప‌నుల్లో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుటుంబం ఫుల్ బిజీ అయ్యింది. మ‌రోవైపు నిహారిక గోవాలో బ్యాచిల‌ర్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తోంది. నిహారిక పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. నిహారిక‌కు గుంటూరుకు చెందిన విశ్రాంత పోలీసు అధికారి కుమారుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఈ పెళ్లి సంబంధం మెగాస్టార్ చిరంజీవి కుదిర్చార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి.

A star-studded engagement for Niharika Konidela and Chaitanya JV | Events  Movie News - Times of India

అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ, మెగా కాంపౌండ్ నుంచి లీక్ అయిన మ్యాట‌ర్ ప్ర‌కారం నిహారిక‌, చైత‌న్య ఒక‌రికొక‌రు ఇష్ట‌ప‌డ్డార‌ని … ఆ త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించి వీరు ప్రేమ వివాహం చేసుకుంటున్నార‌ని అంటున్నారు. కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా నిహారిక‌కు చైత‌న్య‌తో ప‌రిచయం ఏర్ప‌డింద‌ట‌.. ఆ త‌ర్వాత అత‌డు చైత‌న్య నిహారిక వెంట‌ప‌డి మ‌రీ ఆమెను ఒప్పించి.. ఆ త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంటున్నాడ‌ట‌.

Niharika Konidela with her husband | Niharika Konidela Wedding | Niharika  Konidela Latest Video - YouTube

అయితే రెండు కుటుంబాల‌కు ముందే ప‌రిచ‌యం అయితే ఉంది. మ‌రోవైపు చైత‌న్య కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని.. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే చాలా మంది హీరోలు ఉన్నారు. ఈ బాట‌లోనే చైత‌న్య కూడా ఎంట్రీ ఇస్తాడ‌ని అంటున్నారు.