త‌న పెళ్లి గురించి న‌వ‌దీప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… వామ్మో..!

క‌రోనా లాక్‌డౌన్ టాలీవుడ్‌లో బ్యాచిల‌ర్ హీరోల‌కు చాలా ప్ల‌స్ అయ్యింది. షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో ప‌లువురు హీరోలు, హీరోయిన్లు వ‌రుస పెట్టి పెళ్లి పీటలు ఎక్కేశారు. నిఖిల్ – నితిన్ – ద‌గ్గుబాటి రానా – దిల్ రాజు ( రెండో పెళ్లి ) తో పాటు ప‌లువురు హీరోయిన్లు సీక్రెట్‌గా కూడా పెళ్లి చేసుకున్నారు. దీంతో మ‌రి కొంద‌రు బ్యాచిల‌ర్ హీరోల పెళ్లిళ్లు ఎప్పుడు అన్న ప్ర‌శ్న‌లు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి.

Navdeep muscular body on show for Allu Arjun film - tollywood

ప్ర‌స్తుతం ముదురు హీరోగా ఉన్న న‌వ‌దీప్ పెళ్లి ఎప్పుడు అని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. త‌న పెళ్లి గురించి ఎక్కువ లొల్లి జ‌రుగుతుండ‌డంతో చికాకు ప‌డుతోన్న న‌వ‌దీప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశ‌మే లేద‌ని చెప్పాడు. మిగిలిన హీరోల మాదిరిగా త‌న‌కు పెళ్లి జీవితంపై ఆస‌క్తి లేద‌ని..అందుకే తాను త‌న జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని చెప్పాడు.

Navdeep Weight, Age, Wife, Family, Wiki, Biography, Affair, Profile

త‌న‌కు వ‌స్తోన్న పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేయాల‌న్న ఉద్దేశంతోనే సినిమాలు చేస్తున్నాన‌ని న‌వ‌దీప్ చెప్పాడు. న‌వ‌దీప్ అటు టీవీ షోల‌తో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. న‌వ‌దీప్ పెళ్లిపై ప‌లువురు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం న‌వ‌దీప్ పెళ్లి చేసుకోన‌ని చెప్ప‌డం క‌రెక్ట్ కాద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.