Moviesబిగ్‌బాస్ - 4 నుంచి నాగ్ అవుట్‌... కొత్త హోస్ట్‌గా ఆ...

బిగ్‌బాస్ – 4 నుంచి నాగ్ అవుట్‌… కొత్త హోస్ట్‌గా ఆ క్రేజీ హీరో…!

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 తెలుగు ప్రేక్షకులను ఇప్పుడిప్పుడే ఆక‌ట్టుకుంటోంది. తొలి మూడు వారాలు ఏ మాత్రం రేటింగ్‌లు బాగోక‌పోయినా ఇప్పుడిప్పేడే కంటెస్టెంట్ల మ‌ధ్య బిగ్‌బాస్ పెడుతోన్న టాస్క్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక మూడో సీజ‌న్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న నాగార్జునే నాలుగో సీజ‌న్‌కు కూడా హోస్ట్‌గా ఉన్నారు. అయితే నాగార్జున మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. నాగార్జున మూడో సీజ‌న్లో కూడా ఓ వారం బ్రేక్ తీసుకుంటే అప్పుడు ర‌మ్య‌కృష్ణ ఆ వారం హోస్ట్‌గా వ‌చ్చింది.

 

 

ఇక నాగ్ ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ నేప‌థ్యంలో వాయిదా ప‌డింది. కులుమ‌నాలీ షెడ్యూల్ ఆగిపోయింది. ప్ర‌స్తుతం తిరిగి షూటింగ్‌లు ప్రారంభ‌మ‌వుతోన్న నేప‌థ్యంలో వైల్డ్ డాగ్ టీం తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప‌ది రోజుల పాటు జ‌రిగే ఈ షెడ్యూల్లో నాగార్జున‌పై కీల‌క స‌న్నివేశాలు షూట్ చేయ‌నున్నారు.

 

ఈ క్ర‌మంలోనే నాగార్జున 10 రోజుల పాటు బిగ్‌బాస్‌కు దూరం కానున్నారు. ఈ వారంలో మ‌రో సెల‌బ్రిటీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది. నాగ్ బ్రేక్ తీసుకునే వారంలో దగ్గుబాటి రానా బిగ్‌బాస్‌ను హోస్ట్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇందుకు రానా కూడా ఒప్పుకున్నట్టు చెపుతున్నారు. ఇక వైల్డ్ డాగ్ విష‌యానికి వ‌స్తే కొత్త ద‌ర్శ‌కుడు అహిషొర్ సోలోమ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగ్ ఎన్ ఐ ఏ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news