GossipsR R R షూటింగ్‌.. ఆలియా కండీష‌న్ల‌తో జ‌క్క‌న్న అస‌హ‌నం...?

R R R షూటింగ్‌.. ఆలియా కండీష‌న్ల‌తో జ‌క్క‌న్న అస‌హ‌నం…?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఏడు నెలల గ్యాప్ త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక ముందుగా తార‌క్ కొమ‌రం భీం టీజ‌ర్‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభించాల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడు. అయితే లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఈ సినిమాలో అల్లూరిగా న‌టిస్తోన్న రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్ర‌లో నటిస్తోన్న ఆలియా భ‌ట్ పెడుతోన్న కండీష‌న్ల‌తో రాజ‌మౌళితో పాటు ఆర్ ఆర్ ఆర్ టీంలో అస‌హ‌నం క‌ట్ట‌లు తెంచుకుంటోంద‌ట‌.

 

ఆలియా ఇప్ప‌టికే షూటింగ్‌లో పాల్గొనేందుకు రాజ‌మౌళికి అనేక కండీష‌న్లు పెట్టింది. ఇక తాను బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్నాన‌ని.. త‌న షూటింగ్ పార్ట్ అంతా న‌వంబ‌ర్ నెల‌లో కంప్లీట్ చేసేయాల‌ని ఇప్ప‌టికే చెప్పేసింద‌ట‌. ఆ త‌ర్వాత తాను అందుబాటులో ఉండ‌న‌ని కూడా ఆమె రాజ‌మౌళికి చెప్పేసిందంటున్నారు. రాజ‌మౌళి అంటే ఏ సీన్ అయినా పూర్తిగా ప‌ర్‌పెక్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కు రాజీప‌డ‌డు.

 

మ‌రి ఆలియా సీన్ల‌న్ని న‌వంబ‌ర్‌లో ఫినిష్ చేస్తాడా ? ఈ లోగా తార‌క్ కొమ‌రం భీం టీజ‌ర్ కంప్లీట్ చేస్తాడా ? అన్న‌ది చూడాలి. ఇక ఏడు నెల‌ల గ్యాప్‌తో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తోన్న నేప‌థ్యంలో వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు అయినా ఈ సినిమా వ‌స్తుందేమోన‌ని ఆర్ ఆర్ ఆర్ అభిమానులు ఆశ‌ల‌తో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news