Gossipsనానితో అనుష్క చెల్లి రొమాన్స్‌... మ‌త్తెక్కించే అందం రా బాబు..

నానితో అనుష్క చెల్లి రొమాన్స్‌… మ‌త్తెక్కించే అందం రా బాబు..

టాలీవుడ్‌లో హీరోలు కోకొల్లులుగా ఉన్నారు. అయితే వీరి ప‌క్క‌న న‌టించేందుకు హీరోయిన్ల కొర‌త మాత్రం తీవ్రంగా ఉంది. ఎంత మంది హీరోయిన్లు వ‌చ్చినా హీరోల‌కు మాత్రం హీరోయిన్ల కొర‌త ఉంది. ఇటీవ‌ల తెలుగులో మ‌ళ‌యాళం హీరోయిన్ల హ‌వా బాగా న‌డుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే క‌న్న‌డ భామ‌లు కూడా తెలుగులోకి దూసుకు వ‌స్తున్నారు. అనుష్క‌, ర‌ష్మిక ఇలా క‌న్న‌డ న‌టీమ‌ణుల హ‌వా కూడా ఇక్క‌డ బాగానే ఉంది.

 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో క‌న్న‌డ బ్యూటీ కూడా తెలుగులో పాగా వేసేందుకు రెడీ అవుతోంది. క‌ర్నాట‌క‌లోని మంగుళూరుకు చెందిన కృతి శెట్టి మోడ‌లింగ్‌తో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యి ఇప్పుడు సినిమాల్లో త‌న ల‌క్ ప‌రీక్షించుకుంటోంది. అనుష్క స్వ‌స్థ‌లం అయిన మంగుళూరే కృతి స్వ‌స్థ‌లం. దీంతో ప‌లువురు ఆమెను అనుష్క శెట్టి, కృతి శెట్టి ఇద్ద‌రిది ఒకే వ‌ర్గంతో పాటు ఒకే ఊరు కావ‌డంతో అనుష్క‌కు చెల్లి అంటూ కామెంట్ చేస్తున్నారు. కృతిని చూస్తుంటే మ‌త్తెక్కించే అందంతో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతోంది.

 

కృతి తొలి తెలుగు సినిమా మెగా మేన‌ళ్లుడు ఉప్పెన‌. ఇప్పుడు ఆమెకు ఏకంగా నేచుర‌ల్ స్టార్ నాని ప‌క్క‌న న‌టించే ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. ఈ ఛాన్స్‌తో ఆమె పెద్ద జాక్‌పాట్ కొట్టేసిందంటున్నారు. నాని తాజా చిత్రం  శ్యామ్ సింఘరాయ్ లో కథానాయికగా నటించడానికి కృతిని సంప్రదించారట. ఇప్పటికే సంతకం చేసిందని తెలుస్తోంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news