Moviesబిగ్‌బాస్ 4లో ఏ కంటెస్టెంట్ రెమ్యున‌రేష‌న్ ఎక్కువో తెలుసా...

బిగ్‌బాస్ 4లో ఏ కంటెస్టెంట్ రెమ్యున‌రేష‌న్ ఎక్కువో తెలుసా…

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 4 సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా తొలివారం చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఇక ఈ వారం ఎలిమినేష‌న్లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్ల‌లో ఇప్ప‌టికే ముగ్గురిని సేఫ్ చేసిన బిగ్‌బాస్ ఈ రోజు మిగిలిన న‌లుగురిలో ఎవ‌రిని సేఫ్ చేసి ఎవ‌రిని ఎలిమినేట్ చేస్తాడో ?  చూడాలి. ఇదిలా ఉంటే ఈ సారి అంత ఫేమ‌స్ కంటెస్టెంట్లు లేర‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం హౌస్‌లో ఉన్న వారిలో ఏ కంటెస్టెంట్‌కు ఎంత రెమ్యున‌రేష‌న్ అన్న‌ది ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్ టాపిక్‌గా మారింది.

 

మొత్తం 16 మంది కంటెస్టెంట్ల‌లో 9 మంది మ‌హిళ‌లు, 7 గురు పురుష కంటెస్టెంట్లు ఉన్నారు. అంద‌రిలోనూ ఎక్కువుగా బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్ లాస్య‌కు రోజుకు రు. ల‌క్ష ఇస్తున్నార‌ట‌. ఆమె ఎన్ని రోజులు హౌస్‌లో ఉంటే అన్ని లక్ష‌లు వ‌స్తాయి. లాస్య త‌ర్వాత ఆ రేటుకు కాస్త అటూ ఇటూగా హీరోయిన్ మోనాల్ రెమ్యున‌రేష‌న్ ఉంద‌ని తెలుస్తోంది.

 

ఇక మిగిలిన వారిలో అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దేత్త‌డి హారిక‌, నోయ‌ల్‌కు రోజుకు రు. 50 వేలు రెమ్యున‌రేష‌న్‌గా ఉందంటున్నారు. ఇక మిగిలిన కంటెస్టెంట్ల‌కు అంత‌క‌న్నా త‌క్కువే ఇస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం క‌రోనా వల్ల షూటింగ్‌లు కూడా లేక‌పోవ‌డంతో ఇందుకు వారు అంగీక‌రించిన‌ట్టుగా తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news