Gossipsరాధేశ్యామ్‌కు అదే పెద్ద ఎదురు దెబ్బ‌... మ‌రో సాహోనే...!

రాధేశ్యామ్‌కు అదే పెద్ద ఎదురు దెబ్బ‌… మ‌రో సాహోనే…!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో జిల్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. రెండు ద‌శాబ్దాల క్రితం యూర‌ప్‌లో జ‌రిగిన ఓ ప్రేమ‌కథ ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ప్రేమ‌క‌థ‌తో పాటు యాక్ష‌న్‌, ఎమోష‌న్ అన్ని క‌ల‌గ‌లిపి రాధాకృష్ణ ఈ సినిమ‌ను తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌.

ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు త‌ల్లిగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి భాగ్య శ్రీ న‌టిస్తోంది. ఇప్ప‌టికే 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గురించి ఓ వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వైర‌ల్ అవుతోంది. అదే ఈ సినిమాకు మెయిన్ కంప్లైంట్ అంటున్నారు. ఈ సినిమా లెన్త్ మూడు గంట‌ల‌కు పైగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఓవ‌రాల్ లెన్త్ 3.15 గంట‌ల‌కు పైగా ఉంటోంద‌ట‌. అయితే ఇది సినిమాకు పెద్ద మైన‌స్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమా 2.30 గంట‌లు మాత్ర‌మే ఉంటే క్రిస్పీగా ఉండ‌డంతో పాటు రిపీటెడ్ ఆడియెన్స్ వ‌స్తార‌ని.. సాహో సైతం ర‌న్ టైం ఎక్కువుగా ఉండడంతోనే సాగ‌దీసిన ఫీలింగ్ రావ‌డం కూడా సినిమాకు మైన‌స్ అయ్యింది. ఇప్పుడు రాధేశ్యామ్ విష‌యంలోనూ అదే పెద్ద కంప్లెంట్ కానుంద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో మేక‌ర్స్‌ జాగ్ర‌త్తలు తీసుకుని ర‌న్ టైం త‌గ్గించ‌క‌పోతే సినిమా ఏ మాత్రం సాగ‌దీసిన ఫీలింగ్ ఉన్నా దెబ్బే అవుతుంద‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news