Moviesఫీలింగ్స్ : తుఫాను ప‌ల‌క‌రింపు

ఫీలింగ్స్ : తుఫాను ప‌ల‌క‌రింపు

సముద్రం ఒడ్డున ఓ బ‌క్క ప‌ల‌చ‌ని దేహం నాలాంటిదే కాస్త నా క‌న్నా ఎక్కువ వ‌య‌స్సున్న దేహం..”ప్రేమంటే ఏంటో తెలియ‌కుం డా ఉండ‌డం క‌న్నా .. అదేం టో తెల్సుకుని మ‌రిచిపోవ‌డంలోనే ఆనందం ఉంది..” సుస్వాగ‌తం క్లైమాక్స్.. గుర్తుందిగా.. ఆ ఒక్క డై లాగ్ చాలు.. ఆ ప‌లికిన తీరుకే ఇంద‌రు ఫిదా క‌దా! చింత‌ప‌ల్లి ర‌మ‌ణ గారు రాసిన డైలాగ్‌.. ప‌వ‌న్ కు ఎంతో పేరు తీసుకువ‌చ్చిన సీ న్‌..తెల్సా షూట్ అయినంత సేపు ఆయ‌న ఆహార‌మేమీ తీసుకోలేదు.. కే వ‌లం కొద్దిపాటి పాలు తీసుకుని ఉండిపోయారు..సన్ని వేశం ఏమయినా నే ర్చుకుంటారు ఎంత‌సేప‌యినా వెచ్చిస్తారు అని ధ‌ని ఏలే లాంటి ప‌బ్లిసిటీ డి జైనర్లు అనేది ఇందుకే..!

మ‌ళ్లీ చింత‌ప‌ల్లి ర‌మ‌ణ‌గారే.. హైద్రాబాద్ వీధిలో.. ఓ చోట షూటింగ్.. అసిస్టెం ట్లంతా చేతులుకట్టుకుని నిల్చొన్నారు..ప‌వ‌న్ ఉన్నా ర‌ని మ‌రీ కాస్త బెరుగ్గా ఉన్నారు.. ఒక్క‌టే అన్నార‌ట ఆయ‌న ఏం స‌ర్ చ‌లేస్తుందా… మ‌రీ అంత‌గా బిగుసుకుపోతున్నారు మ‌నోళ్లం తా అని.. అది విని అంతా న‌వ్వేశారు….ర‌మ‌ణ గారు నా డైలాగ్ లో ఎక్క‌డా డ‌బుల్ మీనింగ్ ఉండ‌కూడ‌దండి అని ప‌దే ప‌దే చెబు తార‌ని గుర్తుచేసుకున్నారాయ‌న‌.

అస‌లా పుస్తకం (అత‌డే ఆక్సిజ‌నం) రాక‌పోతే బాగుండు.. నాపై ఏముద్రా లే కుండా ఉంటే బాగుండు..అనుకుంటానా కానీ ఆ హైటె క్ సిటీ దాటి కొండా పూర్ కు పోయిన రోజు ఒక‌టి గుర్తుకువస్తుంది.. అంత‌కుమునుపు ఆయ‌న గురించి తెల్సుకోవాల‌న్న తాపత్ర య‌మేదో గుర్తుకువ‌స్తుంది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ నేను ప‌వ‌న్ ఫ్యాన్ ని కాను కానీ.. ఆయ‌న సాయం చేసే గుణం ఒక్క‌టి చాలు జీవి తాంతం ఎవ్వ‌రికి అయినా గుర్తుండిపోయేలా చేస్తుంది.

పాట బాగా రావాలి.. తీన్మార్ సంద‌ర్భంలో అని అనుకుంటున్న మాట‌..రైట‌ర్ ర‌హ‌మాన్ వెళ్లారు..గాలుల‌న్నీ నాతో పాటు ఊయ లూపి పాటే పాడ‌గా..న‌ను నే ను మ‌రిచి ఒంట‌రిగా నిలిచానే.. గెలుపు త‌లుపులే తీసేనే.. ఇదీ ప‌ల్ల‌వి.. ప‌వ‌న్ విన్నారు..ఎంత‌గా ఆ య‌న‌ను మెచ్చుకున్నారో..క‌ర్నూలు కు చెందిన ఆ కుర్రా డు మ‌రో పాట కూడా రాశాడు.. అదే వ‌య్యారాల జాబిల్లి ఓణి క‌ట్టి.. ఏం టి?స‌ర్ నండూరి వారికి మ‌ళ్లీ పుట్టి అన్నారు..తరువాత వ‌య‌సే వ‌రుస మార్చినది అన్నారు ఏం ప్రాస కోస‌మా లేద్సార్.. అప్ప‌టి దాకా అర్జున్ పాల్వాయ్ అగ్ర‌సివ్ గా ఉంటాడు ఆమె రాక‌తో మారుతాడు క‌దండి అందుకే అలా రాశాను అని అన్నాడ‌ట‌! ఓ గుడ్‌.. అలా పాట‌ను దాని తీరు తెన్నునూ అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారాయ‌న‌.

ఈ సారి ధ‌ని గారి ఆఫీసు.. స్టిల్స్ క‌ట్ చేస్తున్నారు. ప‌వ‌న్ తో గ‌తంలో ప‌నిచేశా రాయ‌న బ‌ద్రీ సినిమా కోసం.. చేసే ప‌నిలో కొత్త‌ద‌నం ఉంటే చాలు ఆయ‌నెంతో ఇష్ట‌ప‌డ‌తారు.. అని చెబుతారు ధ‌ని.. అలా స్టిల్స్ క‌ట్ అయ్యాయి..క‌ట్ చేస్తే అవి హిట్ అయ్యాయి కూడా ..! ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ ని స్టార్ట్ చేశాక మాస్టార్జీ అన్న రైట‌ర్ ను ప‌రిచ‌యం చేసింది ఏలే సోద‌రులే..అప్ప‌టికీ ల‌క్ష్మ‌ణ్ ఏ లే..ధ‌ని ఏలే ఆ బ్యాన‌ర్ లోగో కోసం ప‌వ‌న్ తో కొన్ని చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ త‌రువాతే నా రాజు గాకురుమా పాట‌.. మాస్టార్జీతో రా యించారు.

స‌ర్ .. మీరు ఏమయినా రాయండి హైద్రాబాద్ క‌ల్చ‌ర్ ఉట్టిప‌డాలి.. అదిక‌దా మ‌ న‌కు కావాల్సింది. ఇదీ మాస్టార్జీ తో ప‌వ‌న్ చెప్పిన మాట‌.. అలా పుట్టిన ఆ పా ట ఓ ప్ర‌భంజ‌నం అయ్యింది. ఆ త‌రువాత కూడా మాస్టార్జీతో ఆయ‌న ప‌నిచేశా రు.చేయించారు. ఆయ న రాసిన పాట‌లనే మాస్టార్జీ లొల్లి పేరిట ఆల్బం కూడా చేయించారు.

ఇలా ఇవ‌న్నీ కాదు ఇంత‌కుమించి ప‌వ‌న్ ఒక‌డు జ‌నం మ‌ధ్య‌న ఉన్నాడు.వా డు బాధ్య‌త‌గా ఏదో చేయాల‌నుకుంటున్నాడు. సిని మా కాద్సార్ వాటికి మించి నన్ను చూడాలి.. వాటిని దాటించి న‌న్ను చూడాలి.. ఈ స్టార్ డ‌మ్ ఎంత‌కాల‌ మో ఎవ‌రికి తెల్సు..ఏం టో స‌ర్ భ‌యంగా  ఉంటుంది..ఇందరి అభిమానం చూ శాక‌.. అని అంటాడాయ‌న‌. నేను క‌లిసిన రోజు కొన్ని విష‌యాలు చెప్పాను బు క్ రాసిన సంద‌ర్భంలో ఎదుర‌యిన ఫీలింగ్స్‌ని.. విని ఎంత‌గానో ఆనందించా రా య‌న‌.. ప్ర‌తిభ ఎక్క‌డుంటే ఏం గుర్తించి ప‌ట్టం క ట్ట‌డ‌మే ఆయ‌న‌కు తెల్సిన ప‌ని..ఆయ‌నను అభిమానించే వారు కూడా ఇష్ట‌ప‌డేది ఈ ల‌క్ష‌ణ‌మే.. డియ‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ ప‌వ‌ర్ స్టార్ త‌రఫున పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందుకోండి.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

ఫొటో రైట‌ప్ : లిరిక్ రైట‌ర్ ర‌హ‌మాన్ తో ప‌వ‌న్

Latest news