Moviesఎన్టీఆర్ కోసం ఇద్ద‌రు హీరోయిన్లు.. మీకు ఏ హీరోయిన్ కావాలి ఫ్యాన్స్‌..!

ఎన్టీఆర్ కోసం ఇద్ద‌రు హీరోయిన్లు.. మీకు ఏ హీరోయిన్ కావాలి ఫ్యాన్స్‌..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడు. హారిక అండ్ హాసిని బ్యాన‌ర్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై చిన‌బాబు, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై కూడా త్రివిక్ర‌మ్ క్లారిటీతో ఉన్నార‌ని అంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇద్ద‌రి పేర్లు చ‌ర్చ‌ల్లో న‌లుగుతున్నాయ‌ట‌. ఒక‌రు అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్‌. జాన్వీ బాలీవుడ్‌లో ఇప్ప‌టికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి త‌న‌కంటూ ఓ గుర్తింపు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆమె ఇటీవల న‌టించిన బాలీవుడ్ సినిమా గుంజ‌న్ స‌క్సేనా ప్రేక్ష‌కాదార‌ణ పొందింది. ఇక శ్రీదేవి కుమార్తె కావ‌డంతో ఆమెను ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టింప‌జేస్తే సినిమాకు తిరుగులేని క్రేజ్ ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. నిర్మాత‌లు కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

మ‌రో టాక్ ఏంటంటే గ‌తంలో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అర‌వింద స‌మేత‌లో హీరోయిన్‌గా చేసిన పూజా హెగ్డేను తీసుకుంటే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న త్రివిక్ర‌మ్‌కు ఉంద‌ట‌. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌లో ఎవ‌రో ఒక‌రు ఫైన‌ల్ అవుతార‌నే అంటున్నారు. త్రివిక్ర‌మ్ మాత్రం పూజ వైపు మొగ్గుతుంటే నిర్మాత‌లు, మ‌రి కొంద‌రు టెక్నీషియ‌న్లు మాత్రం జాన్వీవైపు మొగ్గుతున్నార‌ట‌. మ‌రి ఫ్యాన్స్ మీకు ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌లో ఏ హీరోయిన్ ఎన్టీఆర్ ప‌క్క‌న బెస్ట్ చాయిస్ అవుతుందో ?  కింద కామెంట్ల రూపంలో తెలియ‌జేయండి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news