బ్రేకింగ్‌: హైకోర్టు ఆదేశాల‌తో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు న‌మోదు

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీకి వ‌రుస‌గా హైకోర్టు నుంచి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. తాజాగా హైకోర్టు ఆదేశాల‌తో ఓ వైసీపీ ఎమ్మెల్యేపై కేసు న‌మోదు కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మ‌హిళ ఫిర్యాదు మేర‌కు ఈ కేసు న‌మోదు అయ్యింది. గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గంలోని ద్వార‌కాతిరుమ‌ల మండ‌లంలోని మ‌ల‌సానికుంట‌కు చెందిన ఆదిల‌క్ష్మి అనే మ‌హిళ త‌న ఇంటిపై దాడి చేశార‌ని ఆమె స్టేష‌న్లో ఫిర్యాదు చేసింది.

 

 

 

అప్పుడు పోలీసులు కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో ఆమె హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై ద్వారకాతిరుమల పీఎస్‌లో ఐపీసీ 448, 506, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక త‌లారి వెంక‌ట్రావు 2014లో గోపాల‌పురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.

Leave a comment