మెగా ఫ్యామిలీ సినిమాలో ఉపేంద్ర‌… మళ్లీ రిపీట్‌

క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో న‌టించాడు. ఆ సినిమాలో బ‌న్నీ వ‌ర్సెస్ ఉపేంద్ర మ‌ధ్య జ‌రిగిన సీన్లు సినిమాకే బాగా హైలెట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఉపేంద్ర మ‌రోసారి మెగా హీరో సినిమాలో న‌టిస్తున్నాడు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

 

ఈ రోజు ఉపేంద్ర పుట్టిన రోజు కానుకగా టీం మెంబ‌ర్స్ శుభాకాంక్ష‌లు చెప్పారు. హీరో వ‌రుణ్ సైతం ఉపేంద్ర‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డంతో పాటు ఉపేంద్ర‌తో క‌లిసి సినిమా కోసం ప‌నిచేసేందుకు చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాన‌ని ట్వీట్ట‌ర్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇదివరకెన్నడూ కనిపించని రోల్ లో కనిపించనుండగా..ఉపేంద్ర ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో తెలియాల్సి ఉంది. అల్లు అరవింద్ స‌మ‌ర్పించే ఈ సినిమాను రేనైస్సేన్ష్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అల్లు వెంక‌టేశ్‌, సిధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a comment