పేటీఎంకు గూగుల్ షాక్‌.. యాప్ తొల‌గింపు

డిజిట‌ల్ చెల్లింపుల విధానంలో దిగ్గ‌జ యాప్‌గా ఉన్న పేటీఎంకు గూగుల్ పెద్ద షాకే ఇచ్చింది. పేటీఎంను గూగుల్ త‌మ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకే పేటీఎం యాప్‌ను తామే ప్లే స్టోర్ నుంచి తొల‌గించామ‌ని కూడా గూగుల్ చెప్పింది. ఈ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల నేప‌థ్యంలో గ‌తంలోనే గూగుల్ పేటీఎంకు నోటీసులు జారీ చేసింది.

 

 

క్యాసినోస్, గ్యాంబ్లింగ్ మనీ ప్రమోషన్లు తమ నిబంధనలకు విరుద్ధమని చెప్పిన గూగుల్ పేటీఎం వీటిని ఉల్లంఘించింద‌ని కూడా చెప్పింది. ఇక దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు పేటీఎం స్పందించ‌లేదు. అయితే ఇది పేటీఎంకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.

Leave a comment